పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన తాజా మూవీ  ఓజి... సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా విడుదలకు ముందే  ఈ మూవీ భారీ హైప్ ని అందుకుంది. ఈ సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది అనగా తెలంగాణ హైకోర్టు ఓజి మూవీకి భారీ షాక్ ఇచ్చింది.హైకోర్టులో ఓజి మూవీకి ఎదురు దెబ్బ తగలడంతో పవన్ కళ్యాణ్ అభిమానులంతా నిరాశ పడుతున్నారు. మరి ఇంతకీ తెలంగాణ హైకోర్టులో ఓజి మూవీకి తగిలిన ఆ ఎదురు దెబ్బ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ తో పాటు బెనిఫిట్ షోలు కూడా వేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా పర్మిషన్ ఇచ్చేసాయి.

అంతేకాకుండా బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. కానీ తాజాగా తెలంగాణ హైకోర్టు టికెట్ రేట్లకి సంబంధించిన మెమోని సస్పెండ్ చేసింది.ఇక విషయం ఏమిటంటే.. రీసెంట్ గా తెలంగాణ లో ఓజి సినిమాకి బెనిఫిట్ షో వేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతులు జారీ చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కొంతమంది హైకోర్టుకి వెళ్లి ఈ జీవో ని సస్పెండ్ చేయాల్సిందిగా కోరారు.

 దాంతో హైకోర్టు ఓజి మూవీ కి సంబంధించి టికెట్ రేట్లు పెంచిన మెమోని సస్పెండ్ చేసింది.దాంతో ఓజి మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అలాగే హైకోర్టు తీసుకున్న ఈ  నిర్ణయం ఇప్పటికే రాత్రి 10 గంటలకు ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్ కోసం కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్దం నెలకొంది. మరి చూడాలి ఈ టికెట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: