టాలీవుడ్లో , కోలీవుడ్ లో హీరోయిన్గా పేరు సంపాదించిన సంజనా గల్రానీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తెలుగులో నటించింది తక్కువ సినిమాలో అయినా తాజాగా బిగ్ బాస్ సీజన్ 9లో ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. మొదటివారం తన ఆట తీరుతో హౌస్మేట్స్ కి చుక్కలు చూపించిన సంజనా నిన్నటి ఎపిసోడ్లో తనను మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు హౌస్మేట్స్. ఇదంతా ఇలా ఉండగా తాజాగా సంజనా కి సుప్రీం కోర్టు నుంచి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.



2020లో కన్నడ సినీ పరిశ్రమని ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురైలా చేసింది డ్రగ్స్ కేసు.. ఈ కేసులో ప్రముఖ సినీనటి రాగిణి ద్వీవేది,సంజనా ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఈమె 14వ నిందితురాలుగా చేర్చారు. ఈ కేసులో జైలు జీవితాన్ని గడిపి సుమారుగా రెండు నెలల తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన సంజనా పై కొకైన్,LSD,MDMA వంటి మత్తు పదార్థాలను వినియోగించిందంటూ ఈమె పైన పలు రకాల ఆరోపణలు వినిపించాయి. ఈ విషయంపై 2024 మార్చి 25న కర్ణాటక హైకోర్టు ఈ కేసును సైతం సాంకేతిక కారణాలవల్ల రద్దు చేసింది.


కోర్టు రూల్స్ ప్రకారం సెక్షన్ 219 CRPC ప్రకారం 12 నెలల వ్యవధిలోని మూడు కంటే ఎక్కువ నేరాలు ఉంటే వాటి పైన ఒకేసారి విచారణ జరపాలేమంటూ కోర్టు తెలిపింది. అలా ఈ కేసులో సంజనాకు కాస్త ఊరట లభించింది.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పు పైన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయగా ఈ క్రమంలోనే హీరోయిన్ సంజనాకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సంజనా కొకైన్,LSD,MDMA వంటి ఇతర మాదకద్రవ్యాలను సేకరించడానికి ఈమె నైజీరియా డ్రగ్ డీలర్ తో సంప్రదింపులు జరిపినట్లుగా కాల్ రికార్డ్స్ ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వం న్యాయవాది మాట్లాడారు. ఆమెకు సంబంధించి ఆర్థిక లావాదేవుల విషయంలో కూడా వివిధ వ్యక్తులు వాటిని విక్రయించారని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో కూడా డ్రగ్స్ సరఫరా చేసిందని, ఈమె వల్ల ఇరుగుపొరుగు వారు కూడా ఇబ్బందులు గురయ్యారని కర్ణాటక ప్రభుత్వం న్యాయవాది తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి విచారణ చేస్తున్న సమయంలో బెంగళూరు పోలీసులకు ఈమె ఏ విషయాలు చెప్పలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు నోటీసులు ఆదేశాలు జారీ చేయడంతో ఈ విషయం మళ్ళీ వార్తలలో నిలుస్తోంది సంజనా.

మరింత సమాచారం తెలుసుకోండి: