
ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మూవీ మొదటి రోజు కూడా ఆల్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్ సాధించింది . ఇక తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ . 1504 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ టీం . షేర్ పరంగాను 88 కోట్లకు అటు ఇటుగా రాబట్టింది . ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది . వర్షాల కారణంగా కొన్ని సెంటర్స్ లో కలెక్షన్స్ తగ్గినప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ను రాబట్టింది ఈ మూవీ . రెండవ రోజు రాబట్టిన కలెక్షన్స్ తో 100 కోట్ల షేర్ రాబట్టిన సినిమాల లిస్టులో చేరిపోయింది ఓజీ మూవీ .
ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వంద కోట్ల షేర్ ఉన్న సినిమా లేదు . కానీ ఇప్పుడు ఓచి చిత్రంతో తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 100 కోట్ల షేర్ కొల్లగొట్టి ఈ క్లబ్లో జాయిన్ అయ్యాడు . నేడు మరియు రేపు వీకెండ్ నేపథ్యంలో ఈ రెండు రోజులు భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఎక్కువగా ఉందనే మూవీ టీం ఆశిస్తుంది . ఇక ఓవర్సీస్ లోను 4.2 మిలియన్ డాలర్స్ రాబట్టింది ఈ చిత్రం . ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు .