
తెలుగు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఈ వార్త ప్రకారం.. అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న ‘లెనిన్’ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియోను దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ వార్త వినగానే అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు.‘లెనిన్’ సినిమాలో అఖిల్ లుక్, ప్రెజెంటేషన్, బాడీ లాంగ్వేజ్ అన్నీ పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయి. ఈ సినిమాకి అఖిల్ తన మొత్తం ఫిజిక్‌ని రీడిజైన్ చేసుకున్నాడు. ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతూ, రిగరస్ ట్రైనింగ్ తీసుకుంటూ, తన కెరీర్‌లో అత్యంత భిన్నమైన రోల్ కోసం సిద్ధమవుతున్నాడట. దర్శకుడు, నిర్మాతలతో కలిసి అఖిల్ ఈ సినిమాను చాలా పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఇన్నాళ్లుగా ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ బయటకు రాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే, ఇప్పుడు దీపావళి సందర్భాన్ని ఉపయోగించుకుని మూవీ మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదంతా విన్న అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. “దీపావళికి లెనిన్ గ్లింప్స్ అంటే అఖిల్ కెరీర్ టర్నింగ్ పాయింట్!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అఖిల్ కూడా ఈ సినిమాతో కొత్త ఇమేజ్, కొత్త ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే నమ్మకం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. మరి నిజంగా లెనిన్ మూవీ గ్లింప్స్ ఎలా ఉండబోతుందో..? అఖిల్ ఏ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడో..? చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం — ఈసారి అక్కినేని సినీ ఫ్యామిలీ లవర్స్కి దీపావళి పండుగ ముందే వచ్చేసిన్నట్లే అంటున్నారు జనాలు..!!