టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అనేది అందరికి తెలుసు. ఆయన హీరోగా, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన తాజా మాస్ ఎంటర్‌టైనర్ “మాస్ జాతర” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, రిలీజ్‌కి ముందు నుంచే భారీ అంచనాలను రేపింది. రవితేజ స్టైల్‌, ఎనర్జీ, ఆయన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, అలాగే శ్రీలీల చురుకైన స్క్రీన్ ప్రెజెన్స్ – ఇవన్నీ కలిపి సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేశాయి.పలు సార్లు వాయిదా పడి చివరికి విడుదలైన ఈ సినిమా, మిక్స్డ్ టాక్ టాక్‌ తెచ్చుకుంది. ప్రత్యేకంగా ప్రీమియర్ షోస్‌ నుంచే మిక్స్డ్ టాక్ రిపోర్ట్స్ రావడంతో రవితేజ అభిమానుల్లో కూసింత టెన్షన్ మొదలైంది. వారాంతం (వీకెండ్‌) కాబట్టి టాక్ తో పని లేకుండా  డీసెంట్ బుకింగ్స్‌ను సాధిస్తూ, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకి అసలు పరీక్ష మొదలవ్వబోతోందని చెప్పాలి.


ఎందుకంటే సోమవారం కలెక్షన్స్‌నే సినిమా యొక్క నిజమైన స్థైర్యాన్ని అంచనా వేసే సూచికగా పరిగణిస్తారు. వర్క్‌డేలో కూడా బుకింగ్స్ బాగుంటే, ఆ సినిమా బలమైన మౌత్ టాక్‌ దక్కించుకున్నట్టే. అదే కొంచెం డ్రాప్‌ అయితే, మాస్ జాతరకు ఎదురుచూసిన రన్‌ కొద్దిగా మందగించవచ్చు. కాబట్టి ఈ సోమవారం బుకింగ్స్‌, వసూళ్లు – ఇవే సినిమాకి అసలు టెస్ట్‌గా మారబోతున్నాయి.ఇక ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మాస్ బీట్‌లతో పాటు, పండుగ వాతావరణాన్ని తలపించే పాటలు ప్రేక్షకుల్ని థియేటర్లలో నర్తింపజేస్తున్నాయి. అలాగే, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్‌, ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. ప్రొడక్షన్ క్వాలిటీ, టెక్నికల్ వాల్యూస్ కూడా సినిమా హైలైట్‌గా మారాయి.మొత్తానికి, “మాస్ జాతర” రవితేజ కెరీర్‌లో మరో మాస్ ఫెస్టివల్‌లా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ పండుగ ఎంతకాలం కొనసాగుతుందో, ప్రేక్షకుల మద్దతు ఎంతవరకు లభిస్తుందో – అది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇక రవితేజ స్టామినా, శ్రీలీల క్రేజ్‌, భీమ్స్ సంగీతం కలయిక ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఎంత బలం ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: