ఈరోజు జరుగుతున్న ‘ఉగాది’ పండుగ హీరో నానికి ఊహించని ఆనందాన్ని ఇచ్చింది. దీనికి కారణం హీరో నాని ఇంటిలో మరో బుల్లి నాని అడుగుపెట్టాడు. నానీ భార్య అంజన పండంటి బాబుకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం తెల్లవారు జామున ఓ ప్రైవేటు హాస్పటల్ లో అంజనా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బాబు క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
పండుగ రోజున పండంటి బిడ్డ ఇంట్లోకి రావడంతో నాని కుటుంబ సభ్యుల ఆనందం రెండింతలు కావడమే కాకుండా రెట్టించిన అనందంతో ఈ ఉగాది పండుగను మంచి జోష్ తో జరుపుకుంటున్నాడు నాని. ఐదేళ్ల పాటు ప్రేమించుకొన్న తర్వాత 2012లో నాని, అంజనా వివాహం చేసున్న విషయం తెలిసిందే.
నాని జీవితంలో భార్య అంజనా అడుగుపెట్టిన తర్వాత అతడి కేరీర్ తారాజువ్వలా దూసుకుపోతు టాప్ హీరోల స్థాయికి నాని చేరుకున్నాడని అతడి సన్నిహితులు అంటూ ఉంటారు. వరస హిట్ల తో దూసుకుపోతున్న నాని ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్‌ను సాధించిన ఆనందం మధ్య ఇప్పుడు కొడుకు కూడ పుట్టడంతో మరింత అనందంతో పరుగులు తీస్తాడు అనుకోవాలి.
వినూత్నమైన పాత్రల ఎంపికలో తనదైన ప్రతిభను కనపరుస్తూ ఎటువంటి వారసత్వం లేకుండా రాణిస్తున్న నానీకి ఈ ఉగాది అతడి జీవితంలో మరిచిపోలేని పండుగ అనుకోవాలి. మరి ఈచిన్న నాని ఎలా ఉంటాడో తెలియాలి అంటే నాని షేర్ చేయబోయే ఆ బుడ్డోడి ఫోటోల కోసం మరి కొద్ది రోజులు ఆగాలి..