ఈ మద్య స్టార్ హీరో, హీరోయిన్ల చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పై ఔత్సాహిక కళాకారులు తమదైన స్టైల్లో డ్యాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో కొన్ని సక్సెస్ కూడా అవుతున్నాయి. ఆ మద్య రాంచరణ్ నటించిన ‘మగధీర’ చిత్రంలో కొన్ని డైలాగ్స్ తో అందరినీ ఆకర్షించాడు ఓ చిన్న కుర్రాడు. ఆ కుర్రాడిని రాంచరణ్ ప్రత్యేక్ష కలిసి..డైలాగ్స్ విని ఎంతో సంతోషించాడు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంతలు నటించిన మూవీ ‘రంగస్థలం’ .
ఈ సినిమాలో రంగమ్మ, మంగమ్మ పాటకు సమంత, రామ్‌చరణ్ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. చాలా మంది నెటిజన్లు ఈ పాటకు పేరడీలు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ చిన్న కుర్రోడు స్కూల్ డ్రెస్ వేసుకొని ‘రంగమ్మ’ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశాడు. ‘ఈ వీడియోను ఒక్కసారి చూసి ఊరుకోలేరు, మళ్లీ చూడాలని అనిపిస్తోంది’ అంటూ సమంత, అనసూయ, సుకుమార్‌ను ట్యాగ్ చేశారు.
బుడ్డోడి డ్యాన్స్‌కు సమంత ఫిదా అయ్యింది.. ‘సరే.. ఈ క్యూటీని నేను కిడ్నాప్ చేస్తా’ అంటూ లవ్ సింబల్స్‌ను ట్వీట్ చేసింది. మొత్తానికి సమంతను ఫిదా చేసిన ఆ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.