ఇక అల .. వైకుంఠపురములో.. తెలుగు , మలయాళ వెర్షన్ ల శాటిలైట్ , డిజిటల్ రైట్స్ డీల్ 29కోట్లకు క్లోజ్ అయ్యిందని సమాచారం. తద్వారా బన్నీ కెరీర్ లో అత్యధిక నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన చిత్రంగా అల... వైకుంఠపురములో.. రికార్డు సృష్టించింది. ఇంతకుముందు నాపేరు సూర్య హిందీ డబ్బింగ్ రైట్స్ తోపాటు తెలుగు, మలయాళం శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్ని కలుపుకొని 24కోట్ల బిజినెస్ చేసింది. అయితే బన్నీ నటించిన సినిమాలకు హిందీ లో కూడా ఎక్కువ ఆధరణ ఉండడం తో అల.. వైకుంఠపురములో చిత్రం యొక్క హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్ ను హోల్డ్ లో పెట్టారట. భారీ ధరకు ఆ రైట్స్ ను అమ్మాలని చూస్తున్నారు నిర్మాతలు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురేజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.