ఇటీవల కాలంలో చైనా పేరెత్తగానే అందరికీ గుర్తొచ్చేది కరోనా వైరస్ ఎందుకంటే చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తోంది. అయితే కరోనా వైరస్ గురించి కాస్త పక్కన పెడితే చైనాలో ఊహకందని రీతిలో ఎన్నో అద్భుతమైన నగరాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అంతకుమించిన అత్యద్భుత కట్టడాలు కూడా చైనా సొంతం అని చెప్పాలి.. ఇక ఒక్కసారి చైనాలోని కట్టదాలు చూస్తే ప్రపంచం లోని 7 వింతలను తలదన్నే విధంగా ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చైనాలోని ఇలాంటి ఒక కట్టడమే గిన్నిస్ రికార్డు సాధించడం గమనార్హం. చెన్నైలోని షాంఘై నగరం లో ఒక రెస్టారెంట్ ఉంది. సాధారణంగా రెస్టారెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ చైనాలోని రెస్టారెంట్ మాత్రం ఏకంగా ఆకాశాన్ని తాకే అంతా ఎత్తులో ఉండటం గమనార్హం.


 ప్రస్తుతం చైనాలో ఉన్న ప్రధాన నగరాల్లో షాంఘై నగరం కూడా ఒకటి.  ఇక ఇప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకోవడం తో ఇదే ప్రస్తుతం చైనా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఇక ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏమై ఉంటుందా అని అక్కడి ప్రజలందరూ రెస్టారెంట్ కు తరలి వెళ్తున్నారు. ఇక ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏమిటంటే.. ఏకంగా భూమి నుంచి అర కిలోమీటర్ ఎత్తులో అంటే 555.36 మీటర్ల ఎత్తులో రెస్టారెంట్ ను నిర్మించారు. అంటే 120 వ అంతస్తులో ఈ రెస్టారెంట్ ఉంది. దీని పేరు హెవెన్లీ రెస్టారెంట్.



 ఇంకో స్పెషాలిటీ ఏమిటంటే.. సాధారణంగా ఏ హోటల్ లో అయినా సరే కిచెన్ సీక్రెట్ గానే ఉంటుంది. కస్టమర్లకు కిచెన్లోకి అసలు అనుమతించరు. కానీ ఇక్కడ మాత్రం ఈ హోటల్ లో ఓపెన్ కిచెన్ ఉంటుందట.. హోటల్ కి వచ్చే అతిథులు ఎవరైనా సరే కిచెన్ లోకి వెళ్లి వంటకాలు ఎలా తయారు చేస్తున్నారు అని చూసేందుకు కూడా అవకాశం ఉంటుందట. అంతేకాదు ఈ హోటల్ లో ఒకేసారి 256 మంది కూర్చుని విందు ఆరగించేందుకు కూడా అవకాశం ఉంటుందట. అంతేకాకుండా ఈ హోటల్లో 5 ప్రైవేట్ డైనింగ్ రూములు కూడా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఏదేమైనా ఇక ఒక రెస్టారెంట్ గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: