
ప్రపంచంలోనే చాలా కంపెనీలు ఉద్యోగులను నియమించుకోకుండా ఏకంగా టెక్నాలజీ ఉపయోగించుకుంటూ తమ పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నాయి. ఇక కొన్ని కొన్ని హోటల్లో సైతం ఇలా ఏకంగా మనుషులకు బదులు రోబోలతో పని చేయించుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా చేయడం ద్వారా సిబ్బందికి ఇచ్చే జీతం కూడా మిగులుతుందని ఆయా కంపెనీలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఓనర్ చేసిన పని మాత్రం అందరిని ఫిదా చేస్తుంది అని చెప్పాలి. రోబోలను పెట్టుకుని పని చేయడం కాదు.. రోబోలా పనిచేయడం ఆమె ప్రత్యేకత.
చాలా రోజులుగా ఆండ్రాయిడ్ వెయిట్ రేస్ ఆండ్రీ రోబోట్ చైనాలోని సాంగ్ కింగ్ లోని హాట్ పాట్ రెస్టారెంట్లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి జనాలు అక్కడికి క్యూ కట్టారు. ఏకంగా మనుషులను పోలిన రోబోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా కస్టమర్లను స్వాగతించడం దగ్గర నుంచి రెస్టారెంట్లో కస్టమర్లకు సేవలు అందించడం వరకు కూడా అన్ని పనులను ఈ రోబో ఎంతో నీటుగా చేసేస్తుంది. అయితే చుట్టుపక్కల రెస్టారెంట్ యాజమానులు ఈ రోబో గురించి తెలుసుకునేందుకు వచ్చి అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ పనిచేస్తుంది రోబో కాదు.. రోబోలా నటించి అమ్మాయి. అలా నటిస్తుంది ఎవరో కాదు 26 ఏళ్ల కిన్ థి అని తేలింది. ఈమె ఈ హాట్ పాట్ రెస్టారెంట్ యజమాని. రోబోటిక్ డాన్స్ చేయడంలో చాలా ఫేమస్. తనలో ఉన్న టాలెంట్ ని ఇలా వినూత్నంగా వాడుకుంటుంది యువతి.