మీర్ ఉస్మాన్ అలి ఖాన్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ప్రొత్సాహంతో ముస్లిం గడ్డపై భారత అనుసంధానం తో సంభంధం లేకుండా ఎమైఎం సాంస్కృతిక మత వారసత్వంగా 1927లో నిజాం అనుకూల పార్టీగా ఉద్భవించింది. 1938లో వేగంగా అభివృద్ధి చెంద టానికి మత సాంస్కృతి మూలాలపై బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడుగా పార్టీ నూతన రూపాన్ని సంతరించుకుంది. అంతే కాదు బ్రిటీష్ పాలన నుండే పాకిస్థాన్ ఏర్పడటానికి ప్రధాన కారకులైన మహమ్మద్ ఆలి జిన్నా నాయకత్వంలోని "ముస్లిం-లీగ్" కు ఈ పార్టీ అనుసంధానమై అత్యంత సన్నిహితంగా ఉండేది. నైజాం లో రజాకార్ ముమెంట్ కు కారణమైన ఖాసిం రజ్వి స్వాతంత్రం నాటికి ఈ పార్టికి అధ్యక్షుడై, హిందూ సమాజంపై ధారుణ మారణ హోమం జరిపిన నియంత.

బహదూర్ యార్ జంగ్

ఆ తరవాత సర్దార్ పటేల్ సైనిక చర్య ప్రకటించటం తో  నైజాం,  భారత యూనియన్లో ఐఖ్యమవ్వట తో జైలు పాలై ఆ తరవాత పార్టీని వారసత్వాన్ని అబ్దుల్ వాహీద్ ఒవైసీ కి ఒప్పగించి దేశం వదలి పాకిస్థాన్ కు పారిపోయాడు. ఆ తరవాత అబ్దుల్ వాహీద్ ఒవైసీ కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ, ఆ తరవాత సలావుద్దీన్ కుమారులు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఒవైసీలు ఏడుదశాబ్ధాల పాటు నిరంతరంగా పాతబస్తీని పాలిస్తూవస్తున్నారు 

ఖాసిం రజ్వి

ఆ వారసత్వంలోని పార్టీయే "ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్-ఎఐఎంఐఎం" ఐతే ఆ పార్టీ కోటకు ఇప్పడు బీటలు వారుతున్నాయి. అది కూడా దాని పెట్టని కోట పాత బస్తీ లో కావడం మరువరాదు. దాదాపు 30 నుంచి 40 ఏళ్లగా సేవలు చేస్తున్న ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి క్రమంగా జారి పోతున్నారు. 

అబ్దుల్ వాహీద్ ఒవైసీ 


గతంలో ఇలాంటి ఘటనలు అసలేమాత్రమూ జరిగిన చరితే లేదు. పోగా, తాజాగా అలాంటి కీలక ఘటనలు కొన్ని చోటు చేసు కోవడం జరుగుతూవస్తుంది. ఎంఐఎం పార్టీకి చెందిన ముఖ్య నేత మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ ఎమైఎం పార్టీకి రాజీనామా చేసి, వేల సంఖ్యలో అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించటం, కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఇప్పుడు పాతబస్తీలో సంచలనం సృష్టించింది. 

సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ

గత కొంత కాలంగా ఎమైఎం పార్టీ తీరు పట్ల, నాయకత్వం పై బిలాల్ గుర్రుగా ఉన్నారు. పార్టీ లో ఈ మద్య జరుగుతున్న పరిణా మాలపట్ల ఆయన చాలా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నిర్వహణ తీరు నాయకత్వ ప్రవర్తన నచ్చక చాలా అసంతృప్తితో ఉండి చాలా కాలం మార్పుకోసం వేచి చూసి రాజీనామా చేశారు. ఎంఐఎం పార్టీపై బిలాల్  అహ్మ్మద్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

Image result for owaisi brothers

ఈ మధ్య ఎంఐఎం పార్టీ పాతబస్తీ ప్రజల కోసం కాకుండా కేవలం మత వివాదాలను పెంచి పోషించుతూ బతకాలని చూస్తుందని బిలాల్ అహ్మద్  ఆరోపించారు. తాను పాతబస్తీ నడి బొడ్డున నిలబడి లౌకికవాదం (సెక్యులరిజం) జిందాబాద్ అని నినదించాలని నిర్ణయించుకున్నట్టు అందుకే ఎంఐఎం పార్టీని వీడుతున్నట్టు వివరించారు. భారత మాత విషయంలో ఎంఐఎం పార్టీ కొత్త వివాదాలని రేకెత్తించడం పట్ల బిలాల్ అహ్మ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Image result for owaisi brothers

మజ్లిస్ బ్రదర్స్ తీరుపట్ల ఓల్డ్ సిటీలో ప్రజలంతా ఆగ్రహంగాఉన్నారని ఆయనచెప్పారు. సెక్యులరిజం పరిరక్షణ కోసమే తాను మజ్లిస్ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు మజ్లీస్ పార్టీ మతాల పేరుతో ప్రజల మధ్య మత వైషమ్యాలు సృష్టిస్తూ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. "మెట్రో రైలు ప్రాజెక్టు" పాతనగరానికి రాకపోవడానికి కారణం ఎంఐఎం పార్టీనే అన్నారు. 

Image result for owaisi brothers

మాజీ ఎంపీ పార్టీ అధ్యక్షులు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీకి జీవించి ఉన్నకాలంలో పార్టీలో అసంతృప్తులుంటే వారిని బుజ్జగించే వారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ కార్యకర్తల్ని విస్మరించి పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు పదవులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సలావుద్దీన్ ఒవైసీకి వెన్నుముకగా ఉండి పార్టీకి సేవలు అందించిన మహ్మద్ పహెల్వాన్ కూడా వందల సంఖ్యలో అనుచరులను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ లో కలిసిపోయారు.


ఎస్.ఆర్.టీ కాలనీ మాజీ కార్పొరేటర్ మహ్మద్ బిలాల్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా మూడు నాలుగు సార్లు జీహెచ్-ఎంసీ కార్పొరేటర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ 1932 నుండి దశాబ్దాల కాలం గా చక్రం తిప్పుతున్నది. ఆ పార్టీ మాటే పాతబస్తీ లో శాసనమని వారు చేసేదే పాలన అని, అందువల్ల ఎమైఎం ని పార్టీ అనే కంటే అగ్రనేతలు అసదుద్దీన్-అక్బరుద్దీన్ ఓవైసి ల కుటుంబ పెత్తనమని వారిదే అక్కడ హవా అని, వారే అక్కడ సర్వం అని పాతబస్తీని కనుచూపుతోనే వారు శాసించే స్థితి ఉందని అంటున్నారు.
Image result for aimim
కాలం మారుతోంది చివరకు ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మారిపోతున్నదని అంటున్నారు. ప్రజలల్లో అభివృద్దిపట్ల ఆలోచన లు మళ్ళటం మతం మతాధికారంపై మార్పు రావటంతో వారి కబంధ హస్తాలనుండి పాత బస్తీ హస్తం పార్టీలోకి జారిపోతున్న పరిస్థితులు క్రమంగా నేలకొంటున్నాయి. సాధారణ ఎన్నికల సమయానికి ఇంకా అనేకమంది కాంగ్రెస్- టీఆర్ఎస్ పార్టీల్లోకి చేరిపోయేటందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. 
Related image

మరింత సమాచారం తెలుసుకోండి: