తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయే సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చింది.  ఆ సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ అందుకు సమ్మతం పలికింది. దాంతో ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదం పలికారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ పరిపాలన కొనసాగిస్తుంది.  అయితే బీజేపీ, టీడీపీ మిత్ర పక్షం కావడంతో ఏపికి ప్రత్యేక హోదా త్వరగా కల్పిస్తారని అందరూ భావించారు..కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. 
Image result for chandrababu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా..ఏపీ ప్రత్యేక హోదా పై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు కేంద్రం. పైగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని..ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెబుతూ వచ్చింది.  ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష నేతలు దర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు.  ప్రత్యేక హోదా కోసం పోరాడుతోన్న ఆంధ్రప్రదేశ్ నేతలకు, ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ షాక్ ఇచ్చింది... ఈ రోజు రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సమాధానం చెప్పింది. 
Image result for special status
విజయసాయి రెడ్డి రెండు ప్రశ్నలు అడిగారు...ఒకటి, స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రానికి ఇవ్వటం లేదు, జీఎస్టీ వచ్చిన తరువాత ఎవరికీ స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదు అనే మాట వాస్తవమా కాదా అని, రెండో ప్రశ్న, జీఎస్టీ వచ్చిన తరువాత కూడా, కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ కొనసాగుతుంది అనే విషయం ప్రచారంలో ఉంది, ఇది నిజమా కదా అని ప్రశ్నలు వేస్తె, దానికి ఆర్థికశాఖ సమాధానం చెప్పంది.  
Image result for vijay sai reddy

అసలు హోదా అనే మాట ఏ రాష్ట్రానికి లేదని కేంద్రం తేల్చి చెప్పింది... ఏపీకి కూడా హోదా ఇస్తామని చెప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది... జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఏ రాష్ట్రానికి పన్ను మినహాయింపు ఇవ్వలేదని కేంద్రం వెల్లడించింది... జీఎస్టీలో రాష్ట్రాల వాటా మాత్రమే తిరిగి చెల్లిస్తున్నాం... కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు అంత వరుకే ఇస్తున్నాం.. ఏ రాష్ట్రానికి హోదా కొనసాగించటం లేదు.. అంటూ, రాజ్యసభలో లిఖిత లిఖిత పూర్వకంగా చెప్పింది.

పన్ను రాయితీలు సాధ్యపడే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపింది. అంతేకాదు, ఆత్మ గౌరవం అంటూ ఎమోషన్ లు పెంచి, రాజకీయ వేడిని పెంచుకుని ఆంధ్రప్రదేశ్ నేతలు గేమ్ ఆడుతున్నరాని సంచనల వ్యాఖ్యలు చేసింది.  ఈ రోజు తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారని, ఒకవేళ రాయితీ ఇస్తే రేపు తమిళం, మలయాళం సెంటిమెంట్ అంటూ మరో ప్రాంతం వారు అంటారని పేర్కొంది. 
Image result for nda govt arun jaitley
అప్పుడు వారి సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.  కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు అంత వరుకే ఇస్తున్నాం.. ఏ రాష్ట్రానికి హోదా కొనసాగించటం లేదు.. అంటూ, రాజ్యసభలో లిఖిత లిఖిత పూర్వకంగా చెప్పింది కేంద్రం...మరో పక్క కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు కూడా అవే లీకులు ఇచ్చాయి... ప్రత్యేక హోదా కన్నా ఇంతకుముందు ప్రకటించిన ప్యాకేజీ అమలే ఉత్తమమని ఆర్థికశాఖ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్యాకేజీని మాత్రమే అమలు చేసి మిగిలిన హామీలు సాధ్యం కాదని ప్రకటించాలని ఆ వర్గాలు అంచనాకు వచ్చినట్లు సమాచారం.
center 06032018
హోదాకు బదులుగా ఇంతకుముందు ప్రకటించిన ప్యాకేజీకి మాత్రమే తాము పరిమితమని, మిగిలినవి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఏపీ కంటే వెనుకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయని, రాయితీలు ఇస్తే ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తాయని కేంద్రం తెలిపింది. హోదా ఇవ్వటం కుదరదని, మొత్తంగా రాయితీలు ఇవ్వాలా? వద్దా? అనేది వాణిజ్య మంత్రిత్వశాఖతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి... మొత్తంగా, ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: