ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 30న రెండవసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాంతో ఆ రోజు దేశ రాజధానిలో సందడే సందడిగా ఉంటుంది. దేశ విదేశీ ప్రముఖులతో హస్తిన హడావుడి చెప్పనక్కరలేదు. ఈసారి రష్యా తదితర దేశాల నుంచి అధినేతలు వస్తారని అంటున్నారు. ఇక దేశంలోని పలువురు ప్రముఖులను కూడా పిలుస్తున్నారు.


ఏపీ సీఎం గా ప్రమాణం అదే రోజు చేస్తున్న వైఎస్ జగన్ కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారు. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తున్న కేసీయార్ కూడా ప్రత్యేక విమానంలో జగన్ తో కలసి ఢిల్లీ వెళ్తారని అంటున్నారు. ఇక జగన్ తల్లి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి కూడా ఢిల్లీ వెళ్తారని అంటున్నారు. ఆమెకు కూడా ప్రత్యేక ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది.


ఇక విజయమ్మను జగన్ తన వెంటబెట్టుకుని ప్రత్యేకంగా వెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయి. వైఎస్సార్ మరణించినపుడు ఓదార్పు యాత్ర పేరిట జగన్ జనంలోకి వెళ్ళాలనుకున్నారు. అందుకోసం సోనియాను అడగడానికి ఢిల్లీ వెళ్ళిన విజయమ్మను అప్పట్లో అవమానించారు సోనియాగాంధీ. దాంతో ఇపుడు సీఎం హోదాలో జగన్ ఢిల్లీకి వెళ్తున్నారు.  అంతే కాదు, తన తల్లిని కూడా తీసుకువెళ్ళడం ద్వారా అక్కడ సోనియా గాంధిని తమకు ఏపీ ప్రజలు అందించిన ఆదరణను చూపించబోతున్నారన్నమాట.


మొత్తానికి ఓడలు బండ్లు అయినట్లుగా 2014 నుంచి కాంగ్రెస్ ఏ మాత్రం ఎదగలేదు సరికదా బాగా  దిగజారిపోతోంది. ఇక ఆ పార్టీకి ఫ్యూచర్ లేదని ఓ వైపు అనుకుంటున్న పరిస్థితి. ఇక జగన్ మాత్రం నాడు సోనియా పక్కన పెట్టినా కూడా  ఇంత ఎత్తుకు ఎదిగి సీఎం అయ్యారు. ఈ సీన్ ఇపుడు  కచ్చితంగా సోనియా గాంధీ చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: