భారత దేశంతో పాటుగా ప్ర‌పంచ‌దేశాలు సైతం  సింగిల్ యూజ్(వాడి ప‌డేసే) ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్సాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సోమవారం  న్యూ ఢిల్లీలో కాన్ఫ‌రెన్స్ ఆఫ్ పార్టీస్ 14వ(సీఓపీ14) స‌ద‌స్సు  జ‌రిగింది. యూఎన్ ఆధ్వ‌ర్యంలో కంబాట్ డిస‌ర్టిఫికేష‌న్ అన్న అంశంపై  ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌దస్సుకు  ముఖ్య అతిధిగా హాజరైన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. సీఓపీ14 ల‌క్ష్యాల కోసం భార‌త్ క‌ట్టుబ‌డి ఉంద‌ని స్పష్టం చేశారు. భూమి, జీవ‌వైవిధ్యంపై వాతావ‌ర‌ణం, ప‌ర్యావ‌ర‌ణం ప్ర‌భావం చూపుతాయ‌ని ప్రధాని అభిప్రాయపడ్డారు. వేడి వాతావ‌ర‌ణం, అస్థిర వ‌ర్షాలు, స‌ముద్ర ప్రాంతాల్లో నీటిమ‌ట్టం పెర‌గ‌డం,  ఇసుక తుఫాన్లు, లాంటి అంశాలు కూడా దీనికి కార‌ణ‌మ‌న్నారు.


ప్ర‌పంచ దేశాల‌న్నీ వాతావ‌ర‌ణ మార్పు ప్ర‌భావాల‌ను ఎదుర్కొంటున్నాయ‌ని ప్రధాని అన్నారు. దీని వ‌ల్ల సార‌వంత‌మైన భూమి విస్తరణం కూడా త‌గ్గుతోంద‌న్నారు. స‌ముద్ర ప్రాంతాల్లో నీటిమ‌ట్టం పెర‌గ‌డం, అస్థిర వ‌ర్షాలు, ఇసుక తుఫాన్లు, వేడి వాతావ‌ర‌ణం లాంటి అంశాలు కూడా దీనికి కార‌ణ‌మ‌ని అభిప్రాయపడ్డారు. భూసారం త‌గ్గ‌కుండా ఉండాలంటే.. నీటిని ఒడిసిప‌ట్టుకోవాల‌ని దెస ప్రజలకు సూచించారు. భూమిలో తేమ‌ను కాపాడుకుంటేనే నేల స‌జీవంగా ఉంటుంద‌న్నారు. ఈ క్రమంలో  సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాల‌ని త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు మోదీ తెలిపారు.



భార‌త్‌ దేశంలో గ‌త కొన్నేళ్ల‌లో వృక్షాల సంఖ్య గణనీయంగా పెరిగింద‌ని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పరిణామం  సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌ని అయన అన్నారు. 2015 నుంచి 2017 మ‌ధ్య వృక్షాల పెరిగాయని చెప్పారు. అవన్నీ దాదాపుగా  0.8 మిలియ‌న్ హెక్టార్లు విస్తరణంలో విస్తరించాయని వివరించారు. 2030 సంవత్సరం  లోగా సుమారు 26 మిలియ‌న్ల హెక్టార్ల విస్తరణం కలిగిన భూమిని మ‌ళ్లీ సార‌వంతం గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రదాని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: