పెద్ద పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న నాయకుల ఇళ్లకు సాధారణంగా సాయుధ దళానికి చెందిన కమాండోలు భద్రతా ఏర్పాట్లను చూస్తూ... ఉంటారు. కనీసం వారి అనుమతి లేకుండా చీమ కూడా భవనం లోపలికి దూరనంతగా వారు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. చాలా సందర్భాల్లో వారి సెక్యూరిటీ నీడలో ఉండే రాజకీయ నాయకులు బయట స్వేచ్ఛగా తిరిగేందుకు కూడా అనుమతించరు. అంతలా భద్రత కట్టదిట్టంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ మనకు తెలుసు కానీ... ఒక దేశంలో దేశ అత్యున్నత పౌరుడు అయిన రాష్ర్టపతి భవనం బాధ్యతను గద్దలు, గుడ్ల గూబలు చూసుకుంటాయనే విషయం తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇంతకీ అలా ఏ దేశంలో గద్దలు రక్షణ బాధ్యతలు  చూసుకుంటాయంటే...


రష్యా అధ్యక్షుని అధికారిక నివాసం క్రెమ్లిన్.. అలాగే ఆ భవనం చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ భవనాల రక్షణ బాధ్యతలను గద్దలు గుడ్ల గూబలు చూసుకుంటున్నాయి. ఇలా 1984 వ సంవత్సరం నుంచి ఇవి గస్తీ కాస్తూ... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధ్యక్షుడికి రక్షణ కల్పిస్తున్నాయి. ఈ గద్దలు, గుడ్లగూబలకు ట్రెయినింగ్ కూడా ఇస్తారు. అసలు ఇలా గద్దలతో ఎందుకు గస్తీ కాయిస్తున్నారని చాలా మందిలో అనుమానం కలుగుతుంది. దాని వెనుక కారణం కూడా లేకపోలేదు. భవనాల మీద కాకులు ఇతర పక్షులు వాలి అపరిశుభ్రంగా చేయకుండా ఉంచేందుకు ఇలా గద్దలతో గస్తీ కాయిస్తున్నారట. ఒక వేళ... ఈ భవనాల చుట్టు పక్కలకు పక్షులు ఏవైనా వస్తే వాటికి మూడినట్లే. శిక్షణ తీసుకుని విధుల్లో ఉన్న గద్దలు, గుడ్లగూబలు ఆ పక్షులని చంపేస్తాయట. వాటి అదృష్టం బాగుంటే బతికి బట్టకడతాయి. ప్రస్తుతం ఇక్కడ 10 గద్దలు, 10 గుడ్ల గూబలు రక్షణ చర్యలు చేపడుతున్నాయి. వీటి భయానికి అసలు ఆ ప్రాంతానికి వేరే పక్షులు రావడానికే జంకుతాయట. ఇక ఆ ప్రాంతం చుట్టు పక్కల ఎక్కడ కూడా వేరే పక్షుల గూళ్లు కనిపించవని స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: