రాజ‌కీయం మారే కొద్దీ కొంత మార్పు కూడా పార్టీల‌లో ఊహించ‌ని రీతిలో ఉంటుంది. అనూహ్య ప‌రిణామాలో, విప‌త్తులో వ‌చ్చి పా ర్టీల‌కు భ‌విష్య‌త్తు అన్న‌ది లేకుండా చేసిన దాఖలాలూ ఉన్నాయి. ఓ విధంగా అప్ప‌టిదాకా  కొంత‌వ‌ర‌కూ పార్టీ త‌ర‌ఫున వినిపించి న నోరు బాగుంది..ఊరు బాగుండాలి..అనే ఉద్దేశంతో కొంద‌రి తీరు  కూడా బాగుండె! అధికార  ప్ర‌తినిధులుగా వారు రాణించాల్సి నంత రాణించారు కూడా! కొంద‌రు మాత్రం పార్టీని నిలువునా ముంచారు.


బాబు రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి లీడ‌ర్ల భాష‌, వ‌ర్ల రామ‌య్య లాంటి లీడ‌ర్ల భాష గురించి ఇప్పుడు చెప్పుకోవ‌డం నిజంగానే అవ‌స‌రం. ఇదే సంద‌ర్భంలో ఇద్ద‌రి మ‌హిళా నాయ‌కుల కార‌ణంగా పార్టీ ప‌రువు బ‌జారున ప‌డింది. దీంతో ఆ ఇద్ద‌రూ ఇప్పుడు అడ్ర‌స్సులు లేకుండా పోయారు. హైటెక్ సిటీ రూపంలో ఆ రోజు బాబుకు ఎంత పేరు వ‌చ్చిందో అదే స్థాయిలో అమ‌రావ‌తిలో క‌ల‌ల రాజ‌ధాని అ మ‌రావ‌తిలో కొన్ని నిర్మాణాలు అయినా పూర్తి చేయ‌క‌మునుపే వీరంతా రాజ‌ధాని డ‌ప్పు కొట్ట‌డంతో అధినేత‌కు ఏం చేయాలో తో చింది కాదు. ఇదే సంద‌ర్భంలో వారిని అడ్డుకో లేక‌పోయారు.


ముఖ్యంగా దివ్య‌వాణి, యామిని సాథినేని లాంటి నేత‌ల తీరు కార‌ణంగా వీరు మాట్లాడిన మాట‌లు జ‌నం చ‌ర్చ‌ల్లో బాగా ప్ర‌స్తావన కు వ‌చ్చాయి. ఫ‌లితం ఆ ఇద్ద‌రి మాట‌లే పార్టీ కొంప కొల్లేరు చేశాయి. ముందు నుంచి వీరిద్ద‌రూ లేకున్నా, స‌చివాల యం ఫైళ్ల‌లో సాథినేని యామిని ప్ర‌భావం ఉంద‌ని వా ర్త‌లు రావ‌డంతో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు న‌మోదు అయ్యాయి. అదేవిధంగా బ‌హిరంగ సభ ల్లో దివ్య‌వాణి నోటికి ఎంత వ‌స్తే అంత మాట మాట్లాడి పూర్తిగా ప‌రువు తీసి గంగ‌లో క‌లిపారు. విప‌క్ష నేత‌ల‌ను తిట్టాల‌న్న క‌సిలోనో లేదా బాధ్య‌త‌లోనో భాగంగా అస‌లు విజ్ఞ‌త అన్న‌ది మ‌రిచి, ఇంగితం మ‌రిచి వీ రు ప్ర‌వ‌ర్తించారు. ఈ ఇద్ద‌రు నేత‌ల ప్ర‌భావంతో చాలా మంది ఇరుకున ప‌డ్డారు.


పార్టీలో  భాష ముఖ్యం అన్న వాద‌న పైకి వ‌చ్చినా వారు ప‌ట్టించుకోలేదు స‌రికదా!కొంద‌రు నాయ‌కుల మ‌ద్దతుతో రెచ్చిపోయారు. మీడియా డిబెట్ల‌లో కూడా విజ్ఞ‌త మ‌రిచి మాట్లాడి న‌వ్వుల పాల‌య్యారు. ఇప్పుడు వారిద్ద‌రూ లేరు. వారి అడ్ర‌స్సులే లేవు. ఆ రో జు అరిచిన నోళ్లూ, తిట్టిన నోళ్లూ ఇప్పుడు మూత ప‌డ్డాయి. దివ్య‌వాణి క‌నిపించ‌డం లేదు.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో! ఇక సాథినేని యామిని పార్టీలో కొంద‌రి నాయ‌కుల  తీరు కార‌ణంగా తీవ్ర అవ‌మానా లకు లోన‌యి బీజేపీ గూటికి చేరిపోయారు. ఆమె అలా చే రిపోవ‌డం వెనుక పార్టీని న‌డిపే ముఖ్య నేత‌ల స‌ల‌హాలు కూడా ఉన్నాయ‌ని ఇప్పటికీ చాలా మంది అంటారు. సుజ‌నా, సీఎం ర మేశ్ మాదిరిగానే యామిని బీజేపీ గూటికి చేరినా అక్క‌డ ఇక్క‌డున్నంత స్పీడుగా అయితే లేరు. అస‌లు ఆమె ఉనికే అక్క‌డ క‌ని పించ‌కుండా పోయింది.

కొన్ని సార్లు మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడినా, ఆయా ఇంట‌ర్వ్యూల‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు గా మాట్లాడినా కూడా టీడీపీ కార్య‌క‌ర్తలెవ్వ‌రూ ఆమెను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. బీజేపీ కూడా ఇవ్వాల్సినం త విలువ కానీ గౌర వం కానీ స్థానం కానీ ఇవ్వ‌లేదు. ఆఖ‌రికి ఆ ఇద్ద‌రు లీడ‌ర్ల ప్ర‌భావం ఇవాళ రాజకీయాల్లో లేకుండా పోయింది. టీడీపీ మునిగిపోయి న నావ మాదిరిగా ఉంది. టీవీ 5, టీవీ 9, ఏబీఎన్ వంటి న్యూస్ ఛానెళ్ల‌లో అర‌వ‌డం మిన‌హా వారు సాధించిం దేమీ లేదు. ఓ విధం గా ఆ ఇద్ద‌రినీ ప్రోత్స‌హించి,  పార్టీ ప‌రంగా కీల‌క ప‌దువులు ఇచ్చి, సొంత మీడియా లో కాస్తో కూస్తో మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చిన పాపా నికి అస‌లు  చాలా చోట్ల టీడీపీకి ఉనికి అన్న‌దే లేకుండా చేసిన ఘ‌న‌త వారిదే! ఇప్పుడు వీరిద్ద‌రి ప్ర‌భావాన్ని లోకేశ్ ఒక్క‌సారి అ యినా రిక‌లెక్ట్ చేసుకుంటారా..?పెద్దాయ‌న అయిన ఇలాంటి త‌ప్పిదాలు మ‌ళ్లీ మ‌ళ్లీ చేయ‌కుండా ఉంటారా? బీజేపీలో అప్పుడూ, ఇప్పుడూ ఇలాంటి మాట‌లు మాట్లాడే మ‌హిళా నేత‌లు ఉన్నారా?

 


అంతెందుకు రోజా మిన‌హా వైసీపీలో ఇంకెవ్వ‌ర‌యినా ఆ రోజు రియాక్ట్ అయ్యారా? అంత‌గా రియాక్ట్ అయిన రోజాకే మంత్రి ప‌ద‌వి లేదు ఈ రోజు అలాంటిది అరుపులు అరిస్తే ఆస్తులు రాసిస్తార‌ని అనుకున్నారా ఏంటి? లేదా అరుపులు అరిస్తే అమ‌రావ‌తి రాసిస్తా ర‌ని అనుకున్నారా ఏంటి? ఒక్క‌టి నిజం దివ్య‌వాణికి ఆ రోజు చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో స్థ‌లం కేటాయించార‌ని అందుకే ఆమె పార్టీ విషయ‌మై కృత‌జ్ఞ‌త‌లో భాగంగా త‌నకు తెలియ‌కుండానే అంత వాగుడు వాగేశార‌ని అంటారు. ఇది నిజం అయినా కాకున్నా ఏ నే త‌కూ ఇలాంటి భాష అన్న‌ది ఉండకూడదు.


 

గ్రేట్ ఆర్టిస్టు, డైరెక్ట‌ర్ బాపు గారి హీరోయిన్ గా ఆ రోజు ఆమెకు ఉన్న గౌర‌వం మొత్తం పోయింది. సినిమా ల్లో సంపాదించుకున్న గౌ మ‌ర‌వాన్ని రాజ‌కీయాల్లో పోగొట్టుకున్న నాయిక దివ్య‌వాణే! ఇక యామిని ప్ర‌భావం సెక్ర‌టేరియ‌ట్ విష‌యా ల్లో ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఉండేద‌ని, త‌మ‌కు త ల‌నొప్పులు త‌ప్ప‌డం లేద‌ని కొంద‌రు ఉన్న‌తాధికారులు చంద్ర‌బాబు దృష్టికి తీసుకు పోయినా ఆయ‌న అడ్డు కోలేకపోయారు. ఎం దుకంటే అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టాల నివార‌ణ‌కు బాబు చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ లేదు. ఆ రోజు పార్టీ ఆ య‌న చేతిలో లేదు. ఉందీ అనుకున్న భ్ర‌మ‌లో చాలా మంది ఆయ‌న ద‌గ్గ‌ర‌కు చాలా స‌మ‌స్య‌లను తీసుకుని పోయినా కొంద‌రు మీ డియా జోకుడు గాళ్ల అతి కార‌ణంగా అవేవీ ప‌రిష్కారానికి నోచుకోలేదు. దీంతో టీడీపీకి ఎన్నిక‌ల్లో అనూహ్య రీతిలో ప‌రాభ‌వం త ప్పలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: