ప్రస్తుతం కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్నది ఎంతో కీలకం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అటు కరోనా వైరస్ ఫై ఇటు వ్యాక్సిన్ ఫై  కూడా అందరికీ అవగాహన పెరిగి పోయింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారూ. ప్రభుత్వం కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా అందజేస్తుంది.  దీంతో దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో శరవేగంగా కొనసాగుతుంది. కానీ ఇలాంటి సమయంలో నకిలీ టీకాలు పుట్టుకురావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఎంతో మంది ప్రజలు నకిలీ వ్యాక్సిన్ ద్వారా అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇప్పటికే పలు ప్రాంతాలలో భారీగా నకిలీ వ్యాక్సిన్ లను గుర్తించి కేటుగాళ్ళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అటు ఆసియా ఆఫ్రికా దేశాల్లో కూడా నకిలీ కోవి షీల్డ్ వ్యాక్సిన్లను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వారాల క్రితం వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ఇక అసలైన టీకాలను ఎలా గుర్తించాలి అనే విషయాలను  వివరంగా చెబుతూ అటు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అసలైన టీకాలను ఎలా గుర్తించవచ్చు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా కోవిషీల్డ్, కోవాక్సిన్  వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో స్పుత్నిక్ వి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.


 అయితే వ్యాక్సిన్
 నకిలీదా కాదా అన్నది ఎలా గుర్తించాలి అంటే..

కోవిషీల్డ్‌ :  లేబుల్‌ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వయల్‌పై అల్యూమినియం మూత పైభాగం కూడా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.  ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్‌ అనే పేరు కనిపిస్తుంది. జనరిక్‌ పేరు బోల్డ్‌ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగానే ఉంటుంది.  నాట్‌ ఫర్‌ సేల్‌ అని ఎరుపు రంగుతో అడ్డంగా  ముద్రించి ఉంటే అసలైనదిగా గుర్తించాలి. వయల్‌పై లేబుల్‌ ఎస్‌ఐఐ లోగో కనిపిస్తుంది. ఎస్‌ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. వ్యాక్సిన్ లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. మొత్తం లేబుల్‌పై తేనెపట్టు లాంటి చిత్రం ఒక ప్రత్యేకమైన కోణంలో చూస్తే  కనిపిస్తుంది.  


కోవాగ్జిన్‌  :  లేబుల్‌పై డీఎన్‌ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది.  లేబుల్‌పై సూక్ష్మమైన చుక్కలతో కోవాగ్జిన్‌ అని రాసి ఉంటుంది. కోవాగ్జిన్‌ అని రాసి ఉన్న హోలోగ్రామ్‌ కూడా అతికించి ఉంటుంది. వీటి ఆధారంగా వ్యాక్సిన్ నకిలీదా అసలైనదా అన్నది గుర్తించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: