దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష విషయంలో ఏం జరుగుతుంది ఏంటీ అనే చర్చలు మనం చూసాం. సుప్రీం కోర్ట్ లో కూడా పిటీషన్ వేసి ఎలా అయినా సరే అడ్డుకోవాలని భావించారు. కాంగ్రెస్ పార్టీ కూడా పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేయడం జరిగింది. నేడు దేశ వ్యాప్తంగా జరగనున్న నీట్ మెడికిల్ 2021 ప్రవేశ పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటల నుండి 5గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పేపర్, పెన్ విధానం ద్వారా జరగనున్న పరీక్ష జరుగుతుంది. తెలంగాణ లో 56079 మంది విద్యార్థులు హాజరు కానున్నారు అని అధికారులు తెలిపారు.

మొత్తం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను 16 లక్షల మంది  రాస్తారు. దేశ వ్యాప్తంగా 202 కేంద్రాలు ఏర్పాటు చేసారు. తెలంగాణ లో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు వివరించారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ , హయత్ నగర్ లో కేంద్రాలు ఏర్పాటు చేసారు. దేశ వ్యాప్తంగా 13 భాషల్లో ప్రవేశ పరీక్ష జరిగింది. తెలుగు లో కూడా జరగనున్న  నీట్ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. నీట్ ప్రవేశ పరీక్ష హాజరయ్యే విద్యార్థుల కఠిన మార్గదర్శకాలు విడుదల చేసారు.

బూట్లు కాకుండా చెప్పులు వేసుకుని రావాలన్న ఎన్టీఏ స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటించాలని సూచనలు చేసారు. నీట్ పరీక్ష నిబంధనలు పాటించని విద్యార్థుల హాజరు కావడానికి వీలు లేదు. హెయిర్ పిన్, తాయత్తులు, ఆభరణాలు లాంటివి కూడా ధరించకూడదు అని స్పష్టం చేసారు. ఉంగరాలు, బ్రాస్లెట్స్, చెవి పొగులు, చైన్, నెక్లెస్, లాకెట్లు, బ్యాడ్జి, ప్లాస్టిక్ పర్సు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కు నో ఎంట్రీ అని స్పష్టం చేసారు. అడ్మిట్ కార్డు ఉంటేనే ఎంట్రీ అని ఐడి ప్రూవ్ తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు. మాస్కులు ధరించాలి అని 500 ఎమ్ ఎల్ వాటర్ బాటిల్  అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. డ్రెస్ కోడ్ పాటించాలి...(పొడుగు చేతులు, ఎంబ్రాయిడరీ ,పెద్ద బటన్స్) ఉన్న దుస్తులు ధరించ కూడదు అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: