అధికారంలోకి రాక‌మునుపు దేశ భ‌క్తి సూత్రాలు తెగ వ‌ల్లె వేశారు మోడీ. తాను వ‌స్తే దేశం రూపు, గ‌తి మార్చేస్తాన‌ని తెగ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. వీటినే న‌మ్ముకుని బీజేపీ నాయ‌కులు కూడా ప్ర‌చారం సాగించారు. కానీ వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ దేశం ప్ర‌గ‌తి బాట‌లో లేదు. అప్పుల్లో ఉంది. ఆదాయం ఉన్నా అప్పుల్లో ఉంది. రాష్ట్రాల‌ను ఆదుకున్న‌ది లేదు. ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న‌దీ లేదు. ధ‌ర‌ల‌ను నియంత్రించిందీ లేదు. ఏమ‌యినా అంటే మాత్రం కోపాలు వ‌స్తాయి కానీ సామాన్యుడి బాధ‌లు తీర్చే దారి మాత్రం వెత‌కరు. ఈ క్ర‌మంలో మోడీ స‌ర్కారుపై విప‌రీతం అయిన వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఈ ప్ర‌జా వ్య‌తిరేక‌త అన్న‌ది వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌దైన ప్ర‌భావం చూపించి, బీజేపీ శ‌క్తుల‌ను ఇంటికే ప‌రిమితం చేయ‌డం ఖాయం అన్న వాద‌న ఒక‌టి ప్ర‌జ‌ల నుంచి ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది.


దేశ‌వ్యాప్తంగా పెట్రో, డీజిలు ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. కొద్ది రోజుల్లో ఈ పెంపు 15 రూపాయ‌లుగా ఉంది. పైకి లీట‌రుకు 35 పైస‌లు చొప్పున పెంచుతున్నామ‌ని చెబుతున్నారు కానీ ఆ పెంపు అలా అలా పెరిగి  పెరిగి పైస‌లు కాస్త రూపాయ‌లు అయి, వంద‌లు, వే లు, ల‌క్ష‌లు, కోట్ల రూపాయ‌ల మేర‌కు కేంద్రానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి. పెట్రో అమ్మ‌కాల కార‌ణంగానే కేంద్రం తన‌దైన ఆదాయాన్ని పొందుతున్న‌ద‌ని పార్ల‌మెంట్ సాక్షిగా ఒప్పుకుంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా లాభాలు వ‌స్తున్నా కూడా ధ‌ర‌ల‌ను త‌గ్గించేందుకు ఒక్క‌సారి అంటే ఒక్క‌సారి కూడా ప్ర‌య‌త్నించిన పాపాన పోలేదు.



 ద‌స‌రా పండుగ రోజు కూడా వ‌డ్డ‌న లేదా వాయింపు అలానే ఉంది. దీంతో ప్ర‌భుత్వం పై వినియోగ‌దారులు మండిప‌డుతున్నారు. జీతం డ‌బ్బుల్లో అత్య‌ధికం పెట్రోలు కొనుగోలుకే కేటాయించాల్సి వ‌స్తోంద‌ని వాపోతున్నారు. పోనీ ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ ఏమ‌యినా త‌క్కువ‌లో ఉందా అంటే అక్క‌డే అదేవిధంగా బాదుడు ఉంది. ఏదేమైన‌ప్ప‌ట‌కీ ఈ ద‌స‌రా స‌గ‌టు వినియోగ‌దారుడికి ఎటువంటి మేలు చేయ‌కుండానే పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp