తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మరీ ఇన్ని అబద్ధాలు ఆడుతారని అనుకోలేదు. మీడియాతో మాట్లాడుతు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు శాసనసభలో ఏపీ రాజధాని ఏది అనే విషయమై చర్చలు జరిగిందట. అన్నీ రాజకీయపార్టీల ఆమోదంతోనే, 5 కోట్లమంది ప్రజల అంగీకారంతోనే, ప్రధాన ప్రతిపక్ష నేత ఆమోదంతోనే చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినట్లు అచ్చెన్న చెప్పారు.





ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అచ్చెన్న చెప్పిదంతా అబద్ధమే. ఎలాగంటే ఏపీకి రాజధాని ఏది అనే విషయంపై  అసెంబ్లీ చర్చలు జరగలేదు. ఆల్రెడీ అమరావతిని రాజధానిగా డిసైడ్ చేసేసుకుని చంద్రబాబు అసెంబ్లీలో అదే విషయాన్ని ప్రకటించేశారు. దానిపైన జగన్ మాట్లాడుతు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది కాబట్టి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించటం ఇష్టంలేక తాము కూడా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు.





అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి తన షరతుని కూడా అసెంబ్లీలోనే జగన్ ప్రకటించారు. చంద్రబాబు మాత్రం జగన్ చెప్పిందేదీ పాటించకుండా తనిష్టం వచ్చినట్లు చేసుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్నారుకాబట్టి చంద్రబాబు ప్రతిపక్షాల్లో దేన్నీ పట్టించుకోకుండా తనిష్టం వచ్చినట్లు చేసుకుపోయారు. ఇక 5 కోట్లమంది ప్రజల ఆమోదమన్నదే లేదసలు. అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తు ప్రజల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకోనేలేదు. రాజధాని విషయంలో తన మనసులోని మాటనే ఒక వ్యాపారస్తుల కమిటి ద్వారా నివేదికను తెప్పించుకుని నిర్ణయించేశారంతే.





అప్పట్లో అమరావతిని రాజధానిగా ప్రకటించేటపుడు జరిగింది ఒకటైతే ఇపుడు అచ్చెన్న విరుద్ధంగా చెప్పారు. నోటికొచ్చిన అబద్ధాలు చెబుతారు కాబట్టే టీడీపీ నేతలు జనాల్లో పలచనైపోయారు. ఇంకా ఆ విషయాన్ని అచ్చెన్నలాంటి వాళ్ళు గ్రహించటంలేదు. చంద్రబాబో లేపోతే అచ్చెన్నో లేకపోతే ఇంకెవరైనా పొరబాటున నిజాలు చెప్పినా జనాలు నమ్మనంతగా పరిస్ధితి మారిపోయింది. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు జరిగే లాభం ఏమిటో చెప్పాలి. మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టమేంటో జనాలకు వివరిస్తే బాగుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: