ఇటీవల శాసనమండలిలో వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు చర్చకు రావడం తో... టీడీపీ ఎమ్మెల్సీలు అందరూ వికేంద్రీకరణ బిల్లులు  వ్యతిరేకిస్తుంటే... పోతుల సునీత మాత్రం వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా ఓటు వేసింది. అయితే పోతుల సునీత వికేంద్రీకరణ కొరకు ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. అయితే ఈమె తీరుపై టీడీపీ నేతలు అందరూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పోతుల సునీత పై విమర్శలు గుప్పించారు. బ్రష్టు పట్టిపోయిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కొని జగన్ పంచన చేరిననాడే పోతుల సునీత రాజకీయ విలువలు మర్చిపోయారు అంటూ విమర్శించారు. నిన్నటి వరకు టిడిపిలో సేవా దృక్పథంతో ఉన్న పోతుల సునీత  వైసిపి తీర్థం పుచ్చుకుని.. వైసిపి అవలక్షణాలు అన్నింటిని పునికి పుచ్చుకున్న ట్లు స్పష్టంగా  అర్థమవుతుంది అంటూ  వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. 

 

 

 దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని మూడు రాజధానులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని... వద్దు అని ప్రజలు కోర్టులు  ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయని ఈ విషయాన్నీ పోతుల సునీత  గమనించాలి అంటూ హితవు పలికారు. టీడీపీ ఎమ్మెల్సీ పదవిలో ఉండి  సేవా దృక్పథంతో ఉన్న పోతుల సునీత ప్రస్తుతం వైసీపీ పార్టీ పెయిడ్ ఆర్టిస్టుల లిస్ట్ లో  చేరి రోజువారి  కూలీలుగా అయిపోయింది అంటూ విమర్శించారు. శాసన మండలి లాబీల్లో విజయసాయిరెడ్డి వై.వి.సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి.. మాట్లాడటాన్ని  బట్టి చూస్తే సునీత సమర్థించుకోవడం లోనే ఆమె డబ్బుకు అమ్ముడు పోయింది అని స్పష్టంగా అర్థం అవుతుంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

 

 

 శాసన మండలిలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి టిడిపి ఎమ్మెల్సీలు అందరు  ప్రజాస్వామ్యాన్ని బ్రతికించారు అంటూ ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే... పోతుల సునీతకు  మాత్రం అది కంటగింపుగా మారిపోయింది అంటూ విమర్శించారు. 8 నెలల నుంచి సవాలక్ష తప్పులు చేస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూఎంతగానో  ప్రజా వ్యతిరేకతను మూట  గట్టుకుంటున్న వైసీపీ పార్టీలో చేరిన పోతుల సునీత ను  కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగానే భావించాలి అంటూ విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: