మంత్రి సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో ప్లస్ గా మారుతుందా..?  మైనస్ గా మారుతుందా..? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో హోం మంత్రి చేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి సబితా ఇంద్రారెడ్డిని కారు ఎక్కించారు కేసీఆర్. ఇక సబితా  ఇంద్రారెడ్డికి ఎంతో అనుభవం ఉండడంతో టిఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టిఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డి మైనస్ గా మారుతుంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీ  స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. 

 

 

ఇక మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బడంగ్పేట్ కార్పొరేషన్ విషయానికి వస్తే... టిఆర్ఎస్ కు చుక్కలు కనిపించాయి. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్లో బిజెపి సత్తా చాటగా  టిఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది . ఇక ఆ తర్వాత ఎలాగైనా పరువు కాపాడుకోవాలని భావించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పారిజాత రెడ్డి కి  మేయర్ పదవి ఆశ చూపి కారు  పార్టీలోకి లాగింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి శేఖర్ కు డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టి టిఆర్ఎస్ పార్టీ గెలిచేటట్లుగా చేసింది సబితా ఇంద్రారెడ్డి. అయితే ఎలాగోలా ఇతర పార్టీల నేతలను టిఆర్ఎస్ పార్టీ లోకి లాగి మేయర్ ఉప మేయర్ పదవులు కట్టబెట్టింది. 

 

 

 కాగా 13 సీట్లలో గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థులను ఎలాంటి పదవులు దక్కకపోవడం గమనార్హం. మరి వాస్తవంగా చెప్పాలంటే బడంగ్పేట్ కార్పోరేషన్ లో టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇస్తూ బీజేపి క్లీన్స్వీప్ చేసింది. ఇకపోతే సబితా ఇంద్రారెడ్డి తీరుపై బడంగ్పేట్ కార్పొరేషన్ లో గెలిచిన 13 మంది టిఆర్ఎస్ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అసహనం వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేసేందుకు పదవి ఇస్తే... ఇతర పార్టీ నేతలకు పదవులు కట్టబెట్టి  టిఆర్ఎస్ నేతలకు పదవులు ఇవ్వకుండా పరువు తీస్తావా అంటూ కేసీఆర్ మంత్రి పై అసహనంతో ఉన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డి తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది అని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: