భారత్-చైనా సరిహద్దు లో నెలకొన్న ఉద్రిక్తత దృశ్యం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని భారతదేశంలో ఎంతో మంది వినియోగదారులను కలిగి ఉన్న పబ్ జి యాప్ ను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఎంతో మంది అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే గేమింగ్ యాప్ పబ్జి అనడంలో అతిశయోక్తిలేదు ఎంతోమంది పబ్జి గేమ్ ఆడుతూ గంటల తరబడి సమయాన్ని గడుపుతూ ఉంటారు. అంతేకాదు పబ్జి ద్వారా దేశంలో ఎన్నో అనర్థాలు కూడా జరిగిన విషయం తెలిసిందే.



 పబ్జి బానిసలుగా మారిపోయి ఎంతోమంది చదువులను గాలికొదిలేసి ఏకంగా పబ్జి ఆడకుండా ఉండలేక ఆడుతూ ఆడుతూ ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఉన్నఫలంగా పబ్జి గేమ్ నిషేధానికి గురి కావడంతో ఎంతో మంది అయోమయంలో పడిపోయారు. అయితే పబ్జి మళ్లీ అతి పెద్ద మార్కెట్ కలిగిన ఇండియాలో కి రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టి  పరిస్థితుల్లో భారత ప్రభుత్వాన్ని ఒప్పించి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు పబ్జీ యాజమాన్యం ప్లాన్ చేస్తుందట.



 అయితే చైనా కు సంబంధించిన టెన్సన్ట్  పేరిట కాకుండా క్రాఫ్టన్  పేరిట  యాడ్ ఇచ్చింది పబ్జి. పబ్జి గేమ్ దక్షిణ కొరియాకు చెందిన దని.. క్రాఫ్టన్  సంస్థ ఈ పబ్జి గేమ్ తయారు చేసింది అని ఈ యాడ్ లో తెలిపింది. అయితే గతంలో చైనాకు చెందిన టెన్సన్ట్  సంస్థకు కూడా పబ్జి గేమ్ లో ఎక్కువ శాతం వాటా ఉండగా.. ఇండియాలో నిషేధం తర్వాత టెన్సన్ట్  నుంచి క్రాఫ్టన్ సంస్థ హక్కులను వెనక్కి తీసుకోవడంలో ఇండియాలో మళ్లీ తిరిగి వచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. దీనిపై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: