ఆంధ్రప్రదేశ్ లో ఒకపక్కన వైసీపీ నేతలు ప్రజలను ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నా సరే కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. కొన్ని కొన్ని చోట్ల కార్యకర్తలను, వాలంటీర్లను కూడా వైసీపీ నేతలు వేధిస్తున్నారు అనే ఆరోపణలు టీడీపీ ఎక్కువగా చేస్తుంది. దీని వలన సమస్యలు పెరుగుతున్నా సరే కొందరిలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇక ప్రభుత్వ ఉద్యోగులను కూడా వేధిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగానే వినపడుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వచ్చాయి.

ఇక సర్కార్ కూడా సీరియస్ గానే ఉన్నా సరే మార్పు రాకపోవడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇక తాజాగా అనంతపురం జిల్లాలో ఒక ఆశా కార్యకర్త ఆత్మహత్య వరకు వెళ్ళింది. వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆశావర్కర్ అనిత ను పరామర్శించిన మాజీమంత్రి పరిటాల సునీత వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మరూరు చెర్లోపల్లి లో వైసీపీ నేతల వేధింపులపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడం సరికాదు అని ఆమె ఆరోపించారు.

రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఆశవర్కర్ల పై వేధింపులు జరుగుతున్నాయి అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అరగంట కాదు 24 గంటలు గడిచినా న్యాయం జరగడం లేదు అన్నారు. దిశ చట్టం ఎక్కడ అమలు చేస్తున్నారు అని ఈ సందర్భంగా నిలదీశారు. ప్రెజర్ అని పోలీసులు చెపుతున్నారు అని ఆమె వ్యాఖ్యలు చేసారు. వైసీపీకి ఒక న్యాయం టీడీపీకి ఒక న్యాయం చేస్తున్నారు అని ఈ సందర్భంగా మండిపడ్డారు. మహిళలను వేధిస్తే చెప్పుతో కొట్టండి.. అప్పుడే మరోచోట ఇలా జరగదు అని సూచించారు. బాధితులపై కౌంటర్ కేసులు పెట్టి స్టేషన్ లోకి పిలిచి రాజీ చేస్తారా అని నిలదీశారు. ఇంత అన్యాయం జరుగుతుంటే కేసులు ఎలా రాజీ చేస్తారు అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: