ఎవ‌రి కోపం వారిదే కావాలి. ఎవ‌రి కోపం వారే త‌గ్గించుకోవాలి. ఇత‌రుల కార‌ణంగా మాట్లాడ‌డంలో అర్థం లేదు. త‌న‌కు నిర్మాత‌లు చెప్పినందువ‌ల్లే మాట్లాడాన‌ని ప‌వన్ చెప్పినా ఆ మాట్లాడే విధానం మాత్రం అది కాదు. దీని వ‌ల్ల సున్నిత‌మ‌యిన భావోద్వేగా లున్న ఇండ‌స్ట్రీలో కొంద‌రు ఇబ్బంది ప‌డ‌తారు. ప‌వ‌న్ కార‌ణంగా చాలా మంది జ‌గ‌న్ త‌మ‌కు ఇక అపాయింట్మెంట్ ఇవ్వ‌ర‌నే అనుకున్నారు. కానీ మంత్రి పేర్ని నాని మాత్రం నిర్మాత‌ల‌తో చ‌ర్చించి, సానుకూల‌త వ్య‌క్తం చేసి పంపారు. దీంతో ఇండ‌స్ట్రీ ఊపిరి పీల్చుకుంది. చిరు కూడా జ‌గ‌న్ మ‌నుషుల‌తో మాట్లాడారు అని స‌మాచారం. వీటితో పాటు అల్లు అర‌వింద్ లాంటి ప్రొడ్యూ స‌ర్ల విష‌య‌మై  కూడా జ‌గ‌న్  కాస్త సానుకూలంగానే ఉన్నారు. అంతా క‌లిసి వైజాగ్ వైపు వ‌స్తే బాగుంటుంది అని జ‌గ‌న్  అనుకుంటు న్నారు. అలాంటి ప‌రిణామాల‌కు  నిన్న‌టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఫంక్ష‌న్ మంచి ఆరంభం అయింది.


ఇండ‌స్ట్రీ అంటే కొట్టుకోవ‌డం, తిట్టుకోవ‌డం కాదు క‌లిసి న‌డ‌వ‌డం అన్న సంకేతాలు నిన్న అఖిల్ ఇచ్చాడు. కేవ‌లం స‌మ‌స్య‌ల‌ను అడ్ర‌స్ చేయ‌డానికే సంఘాలు ఉన్నాయే త‌ప్ప ప్ర‌భుత్వాలను తిట్టేందుకు కాద‌ని అదేప‌నిగా ఆ ప‌ని చేస్తే చెడ్డ పేరు వ‌స్తుంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ స‌క్సెస్ మీట్ లో సీఎం జ‌గ‌న్ గురించి నాలుగు మంచి మాట‌లు చెప్పాడు. చాలు ఈ పాటి ముంద‌డుగు.. ఇవ‌న్నీ ఇండ‌స్ట్రీకి మంచే చేస్తాయి. చేయాలి కూడా! గ‌త అనుబంధాల దృష్ట్యా అవంతి శ్రీ‌ను కూడా ఎంత‌గానో స‌హ‌క‌రించి ఈ ఫంక్ష‌న్ ఏర్పాట్ల‌ను ప‌ర్యవేక్షించారు. గ‌తంలో  మాదిరిగా కాకుండా ఎటువంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు లేకుండానే ఈ ఫంక్ష‌న్ ముగిసింది.

మొన్న‌టి రిప‌బ్లిక్ ఫంక్ష‌న్లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు కార‌ణంగా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు చాలా మంది భ‌య‌ప‌డిపోయా రు. వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించే ప‌ద్ధ‌తి ఇది కాద‌ని, అనుకూలం కాక‌పోతే అది కూడా సున్నితంగానే చెప్పాల ని కొంద‌రు నిర్మాత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. పొలిటిక‌ల్ ఇంట్ర‌స్టుల కార‌ణంగా ఇక్క‌డ మాట్లాడ‌డం త‌గ‌ద‌ని కూడా చెప్పారు. ఏదేమైన ప్పటికీ అఖిల్ త‌న సినిమా స‌క్సెస్ తో కొన్ని త‌గాదాల‌కు చెక్ పెట్ట‌గ‌లిగాడు. ఇండ‌స్ట్రీకి నాలుగు రూపాయ‌లు వ‌చ్చే మంచి  ప‌నుల కు అఖిల్ లాంటి క‌థానాయ‌కులు కూడా సాయం చేయాల్సిందే! ఇదే సంద‌ర్భంలో అల్లు అర‌వింద్ కూడా వైజాగ్ త‌న కుటుంబానికి ఏ విధంగా క‌లిసి వ‌చ్చిందో చెబుతూనే, షూటింగ్ లు ఇక్క‌డ చేసేందుకు త‌న స‌మ్మ‌తి కూడా  తెలియ‌జేశారు. అన్నీ బాగుంటే అర‌వింద్ త‌ర‌ఫున నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రీజ‌న‌ల్ ఆఫీసు ప్రారంభించే అవ‌కాశం కూడా ఉంది. ఏపీ కేంద్రంగా ఓ న్యూస్ ఛానెల్ న‌డిపేందుకు ఆయ‌న సన్నిహితులు ఇటుగా వ‌చ్చే అవ‌కాశాలూ ఉన్నాయి. ఇవ‌న్నీ ఇండ‌స్ట్రీకి క‌లిసి వ‌చ్చే ప‌నులే!

మరింత సమాచారం తెలుసుకోండి: