హుజురాబాద్ ఉప ఎన్నిక హాట్ రోజురోజుకు ఊపందుకుంటుంది. ప్ర‌చారంలో నేత‌ల వ్యాఖ్య‌లతో మ‌రింత కాక‌రేపుతున్నారు. తాజాగా బీజేపీ అభ్య‌ర్థి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌తీమ‌ణి జ‌మున చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తి క‌రంగా మారాయి. వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న ఆ రోజుల‌ను గుర్తు చేశారు ఆమె. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఈట‌ల‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించార‌ని, మంత్రి ప‌ద‌వి కూడా ఆఫ‌ర్ చేశార‌ని చెప్పారు. అయినా త‌న భ‌ర్త తెలంగాణ స్వ‌రాష్ట్రంలో కోసం నిల‌బ‌డ్డార‌ని అన్నారు. కానీ, నేడు త‌న భ‌ర్త‌ను సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ కోసం బ‌లి చేశార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు.


  ఈ క్ర‌మంలో తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈట‌ల రాజేంద‌ర్ త‌న త‌మ్ముడ‌ని, త‌న కుడి భుజం అని చెప్పార‌ని గుర్తు చేశారు ఈట‌ల జ‌మున‌. అలాంటి ఈట‌ల రాజేంద‌ర్ లాంటి నాయ‌కుడు దొర‌క‌డం హుజురాబాద్ ప్ర‌జ‌ల అదృష్టం అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు కేటీఆర్ కోసం ఈట‌ల‌ను ప‌క్క‌న బెట్టార‌ని విమ‌ర్శిస్తున్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాల‌నే ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించార‌ని అన్నారు. సీఎం కేసీఆర్ త‌డి బ‌ట్ట‌తో త‌మ గొంతు కోశార‌ని తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు. ధ‌ర్మం-అధ‌ర్మానికి, , అహంకారానికి - ఆత్మ‌గౌర‌వానికి జ‌రుగుతున్న పోరాటం అని ఈట‌ల జ‌మున అభివ‌ర్ణించారు.

 
   ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్ ను గెలిపించాల‌ని హుజురాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆమె కోరారు. మ‌రోవైపు ఈట‌ల రాజేంద‌ర్ కూడా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. త‌న‌ను గెలిపించి అధికార టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాల‌ని కోరుతున్నారు. నోట్ల క‌ట్ట‌ల‌కు, మందు సీసాల‌కు త‌మ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు అమ్ముడు పోరని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్ పోటీ చేస్తున్న విషం తెలిసిందే. బీజేపీ నుంచి బ‌రిలో ఉన్న ఈట‌ల కే అక్క‌డి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: