ఏమాట‌కు ఆమాటే చెప్పుకోవాలి. మంచిని మంచిగా చెప్పుకొంటే త‌ప్పులేదు.. ఇదే ఇదే మాట నెటిజ‌న్ల నుంచి కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చాలా వ్య‌త్యాసాలు ఉన్నాయి. చంద్ర‌బాబు మంచి మాట‌కారి. జ‌గ‌న్ అంత మాట కారి కాదు. చంద్ర‌బాబు ఎప్పుడు ఎక్క‌డ ఏం జ‌రిగినా.. వెంట‌నే రియాక్ట్ అయిపోతారు. అంతేకాదు.. వెంట‌నే ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చేసి సానుభూతి కోసం ప్ర‌య‌త్నిస్తారు.కానీ, జ‌గ‌న్ ఈరెండు అంశాల‌కు అస‌లు ప్రాధాన్యం ఇవ్వ‌రు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. తెలుసుకుంటారు. హైరానా ప‌డ‌రు. మీడియా ముందుకు అస‌లే రారు.

ఇక‌, చంద్ర‌బాబుకు, జ‌గ‌న్‌కు ఉన్న మ‌రో తేడా.. మైకు పుచ్చుకుంటే.. చంద్ర‌బాబుకు స‌మ‌యం తెలియ దు. కార్య‌క‌ర్త‌లైనా.. నాయ‌కులైనా.. ఇదేం బాధ అనుకునే వ‌ర‌కు ఆయ‌న మైకును వ‌దిలిపెట్ట‌రు. కానీ.. జ‌గ‌న్ మాత్రం.. ఎక్క‌డా ఇంత‌సేపు ప్ర‌సంగించిన దాఖ‌లాలు లేవు. పైగా.. ఆయ‌న ఏం మాట్లాడినా.. ఉన్న‌ది ఉన్న‌ట్టు చెబుతారు.. సుత్తి ఉండ‌ద‌నే పేరు తెచ్చుకున్నారు. ఇక‌, ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల‌కు స్పందించే ల‌క్ష‌ణంలోనూ.. ఇద్ద‌రు నేత‌ల‌కు బారీ వ్య‌త్యాస‌మే ఉంది. గతంలో సీఎంగా ఉన్న‌ప్పుడు.. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల‌కు వెంట‌నే రియాక్ట్ అయ్యేవారు. వాటిని ఖండించ‌డమో.. ఎదురు దాడి చేయ‌డ‌మో చేస్తున్నారు.

కానీ, జ‌గ‌న్ మాత్రం.. ప్ర‌తిప‌క్షాలు ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా.. నిమ్మ‌ళంగా ఉంటారు. పార్టీలో కీల‌క‌మైన వారిని రంగంలోకి దింపి.. కౌంట‌ర్లు ఇప్పిస్తుంటారు. ఇలా.. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ల మ‌ధ్య అనేక విష‌యాల్లో వ్య‌త్యాసాలు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. అయితే.. ఒకే ఒక్క విష‌యంలో మాత్రం.. ఇద్ద‌రి మ‌ధ్య ఒకే ల‌క్ష‌ణం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. అదేంటంటే.. స‌న్మానాలు, స‌త్కారాల‌కు దూరంగా ఉండ‌డం. చంద్ర‌బాబు ఒకింత పొడ‌గ్త‌ల‌కు ప‌డిపోతార‌నేపేరున్నా.. ఆయ‌న కూడా స‌న్మానాలు స‌త్కారాల‌కు దూరంగా ఉంటారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ అస‌లు పొగ‌డ్త‌ల‌ను కూడా ద‌రిచేర‌నివ్వ‌ర‌ని.. స‌న్మానాలు.. స‌త్కారాల‌కు క‌డుదూరంలో ఉంటార‌ని.. ఈ విష‌యంలోనే ఈ ఇద్ద‌రు నేత‌ల‌మ‌ధ్య ఒకే అభిప్రాయం ఉంద‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: