ప్రస్తుతం ఎలక్షన్ టైమ్ కొనసాగుతూ ఉండడంతో ఎక్కడికి ఎక్కడ ఎలక్షన్ టార్గెట్ సినిమాలు కూడా ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.కొన్ని సినిమాలు జగన్కు వ్యతిరేకంగా మరికొన్ని తెలుగుదేశం జనసేన పార్టీలకు వ్యతిరేకంగా విడుదలవుతూ ఉన్నాయి.. ఈ వరుసలో ఇప్పుడు మరొక సినిమా రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.. గత కొంతకాలంగా సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పైన ఒక బయోపిక్ సినిమాని తీసినట్లుగా కనిపిస్తోంది. 2019లో వివాక్కానంద రెడ్డి హత్యకు గురికాగా ఇన్నాళ్లు తనని ఎవరు చంపారు అనే విషయాన్ని ఎవరు కనుక్కోలేకపోతున్నారు.


హత్య పైన ఎవరి పైన అనుమానాలు ఉన్నాయి ఇతరత్రా అంశాలు సర్వత్ర ఉత్కంఠాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాలను ప్రస్తావిస్తూ వివేక్ బయోపిక్ గా ఒక సినిమా టీజర్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ముందు నుంచి వివేకాది సహజ మరణం అని గుండెపోటుతోనే ఆయన మరణించారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే ఇది నిజం కాదని గత ఎన్నికలలో ఈసారి కూడా వివేక హత్య కేసు చర్చనీయాంశంగా మారుతున్నది.

దీంతో వైయస్ వివేకానంద రెడ్డి జీవిత కథ ఆధారంగా వివేకం అనే పేరుతో ఒక సినిమాని తెరకెక్కించారు. అందుకు సంబంధించి ట్రైలర్ కూడా వైరల్ గా మారుతున్నది.సిబిఐ ఛార్జిషీట్ దస్తగిరి సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ చిత్రాన్ని తీసినట్టుగా సమాచారం.. వైయస్ వివేక రాజకీయ కుటుంబ నేపథ్యం ఆయన హత్యకు జరిగిన పరిణామాలను చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ట్రైలర్లు చూపించారు. కొత్త ఆర్టిస్టులతో రియలిస్టిక్ గా ఉన్న పాత్రలలో ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 22న ఈ సినిమాని ప్రముఖ వెబ్సైట్..www..vivekabiopic.com లో చూడవచ్చని ఈ ట్రైలర్లు చూపించడం జరిగింది. అయితే ఈ సినిమానీ కేవలం జగన్ టార్గెట్ చేస్తూ తీసినట్టుగా అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: