టీడీపీ అధినేత చంద్రబాబు తన వారసుడు లోకేష్ ని పైకి తీసుకుని రావాలని చూస్తున్నారు.ఈ విషయంలో పొత్తులు ఎత్తులతో పాటు లోకేష్ కోసం యంగ్ టీం ని తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు చూస్తున్నారు అని అంటున్నారు.ఆ క్రమంలో చాలా మందికి కూడా టికెట్లు గల్లంతు అవుతున్నాయి. అదే కోవలో పెందుర్తికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి బాబు టికెట్ లేకుండా చేశారు. ఆ సీటుని జనసేన పార్టీకి ఇస్తున్నారు. ఈ పరిణామంతో  బండారు గత కొన్ని రోజుల నుంచి మౌనంగా ఉన్నారు. ఇంకా అంతే కాదు ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారని అంటున్నారు.బండారుకి టికెట్ ని ఇవ్వకపోతే పార్టీని వీడిపోతామని ఆయన అనుచరులు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు బండారు కూడా వారి మాటలను నిజం చేస్తున్నారని అంటున్నారు. బండారు వైసీపీకి టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. వైసీపీ నేతలు ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటు హామీ ఇచ్చారని అంటున్నారు. బండారు కూడా దానికి సరేనని అన్నారని సమాచారం తెలుస్తుంది.


పెందుర్తి, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ సౌత్ లలో జనసేన పార్టీకి సీట్లు టీడీపీ కేటాయించింది. ఈ నాలుగు చోట్ల తెలుగుదేశం శ్రేణులు రగిలిపోతున్నారు. పార్టీలో మొదటి నుంచి తాము ఉంటే బలంగా ఉన్న తమ సీట్లలో జనసేన పార్టీని దించి తమ సోంత సీట్లలో వేరే జెండాను ఎత్తమంటే ఇక తమ రాజకీయ జీవితం మొత్తం పోయినట్లే అని టీడీపీ శ్రేణులు అంటున్నారు.దాంతో వారంతా కూడా అధినాయకత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ప్రస్తుతం వారి అందరినీ కూడా బండారు ఒక చోటకు చేరుస్తున్నారని ప్రచారం విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. వారి అందరిలో కలసి ఆయన వైసీపీలోకి చేరుతారని అంటున్నారు. ఇంకా అదే విధంగా బండారు వెంట వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడానికి వైసీపీ అధినాయకత్వం భరోసా ఇస్తోందని అంటున్నారు.మొత్తానికి బండారు వంటి పెద్ద నేత టీడీపీని వీడితే అది తెలుగుదేశం పార్టీకి విశాఖ జిల్లాలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇంకా అంతే కాదు బలమైన సామాజిక వర్గానికి చెందిన బండారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: