తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించిన 139 అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.నరసాపురం లోక్ సభ టిక్కెట్ ఆశించి భంగపడిన రఘురామ కృష్ణంరాజుని టీడీపీలో చేర్చుకుని, అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చే విషయంపై చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని, అదే ఆల్ మోస్ట్ ఫైనల్ కావొచ్చని సమాచారం తెలుస్తుంది. దీంతో ఈ విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం ప్రకారం... కడపకు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉండగా... తాజాగా జమ్మలమడుగు ఇన్ ఛార్జ్ భూపేశ్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందని సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ తరుపున జమ్మలమడుకు ఆదినారయణరెడ్డి పేరు కన్ ఫాం అయినట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకా ఇదే సమయంలో... అనంతపురం ఎంపీ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ రాజేష్, కంబూరి నాగరాజు, పూల నాగరాజులలో ఒక పేరు కన్ ఫాం కావొచ్చని అంటున్నారు.


ఇదే జిల్లా మడకశిరి ఎస్సీ నియోజకవర్గంలో తొలుత అనిల్ పేరుని ప్రకటించినప్పటికీ... మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం అడ్డం తిరగడంతో.. ఆ సీటుకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెరపైకి వచ్చింది. మరోవైపు విజయనగరం జిల్లా గజపతి నగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు ఇప్పటికే ప్రకటించినా... తాజాగా ఆ సీటుకు కళా వెంకట్రావు పేరు ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే సమయంలో సూళ్లూరుపేట అభ్యర్థిని కూడా మార్చే అవకాశాలున్నట్లు సమాచారం తెలుస్తుంది.అయితే... అసెంబ్లీకి రఘురామకృష్ణంరాజు అనే అంశం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రఘురామకృష్ణంరాజు విషయంలో చంద్రబాబు బాబు ఒక నిర్ణయానికి వచ్చారని.. అందులో భాగంగా ఆయనను టీడీపీలో చేర్చుకుని, అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి రఘురామ కృష్ణంరాజును బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: