ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బిజెపి పార్టీ ఎక్కువగా సీరియస్ గా సందర్భాలు చాలా తక్కువే. కాకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా భారీ సీట్లను దక్కించుకోవాలి అని బిజెపి పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీలు అయినటువంటి టిడిపి , జనసేన తో పొత్తుగా పోటీ చేయబోతుంది. అందులో భాగంగా వీరికి కూడా భారీ మొత్తంలోనే సీట్లు దక్కాయి. అలాగే కొన్ని సీట్లను ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే సీట్ల పంపిణీ దాదాపుగా పూర్తి కావడంతో వీరు ప్రచారాలను కూడా భారీగా చేయాలి అని ఉద్దేశంలో ఉన్నారు.

ఇకపోతే బిజెపి పార్టీ శ్రేణులు తాజాగా విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి బిజెపి జాతీయ నేతలు సిద్ధార్థ నాథ్ సింగ్ , అరుణ్ సింగ్ హాజరు అయ్యారు. అలాగే తాజాగా బీజేపీ ఎంపీ సీట్లను దక్కించుకున్న కొంతమంది కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఇంత ప్రాధాన్యత కూడుకున్న ఈ సమావేశానికి కొంతమంది బిజెపి సీనియర్ నాయకులు మాత్రం డుమ్మా కొట్టారు. బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు , రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు , సీనియర్ నేతలు విష్ణు వర్ధన్ రెడ్డి , సత్య కుమార్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

వీరు ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడ్డారు. ఇకపోతే ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని సత్య కుమార్ కి , అనుపర్తి నుంచి సోము వీర్రాజును బరిలో ఉంచమని ముందు ప్రతిపాదనలను పెట్టింది రాష్ట్ర బిజెపి నాయకత్వం. కానీ అనుపర్తి నుంచి పోటీ చేయడానికి సోము వీర్రాజు ఈయన విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జ్వరం కారణంగా ఈ రోజు సోము వీర్రాజు ఈ కీలక సమావేశానికి హాజరు కాలేదు అని బిజెపి నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp