భారతీయ జనతా పార్టీ ఈ సారి కూడా భారీ మెజారిటీని తెచ్చుకోవాలి అనే ఉద్దేశంలో ఉంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నుండి అభ్యర్థులను ఎంతో ఆచితూచి ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఐదు విడతలుగా అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఇక తాజాగా బిజెపి పార్టీ వారు ఆరో విడతాను కూడా విడుదల చేసింది. ఈ ఆరవ విడతలో ముగ్గురు అభ్యర్థులతో కూడిన లిస్ట్ నీ బిజెపి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో బిజెపి హై కమాండ్ రాజస్థాన్‌ కు చెందిన రెండు నియోజక వర్గాలు, మణిపూర్‌కు చెందిన ఒక నియోజక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది.

రాజస్థాన్‌ లోని కరౌలీ ధోల్పూర్ (ఎస్సీ) , దౌసా నియోజక వర్గాలు , ఇన్నర్ మణిపూర్ నియోజక వర్గానికి అభ్యర్థులను వెల్లడించింది. తొలి విడతలో 195 మందిని , రెండో విడతలో 72 మందిని , మూడో విడతలో 9 మందిని , నాల్గో విడతలో 15 మందిని , ఐదో విడతలో 111 మందిని ,  ఆరో విడతలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను బిజెపి హై కమాండ్ విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం 405 మంది అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. ఆరు విడతలుగా అభ్యర్థుల పేర్లను బిజెపి హై కమాండ్ విడుదల చేసిన మరికొన్ని స్థానాల ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నాయి.

వాటిపై బీజేపీ హై కమాండ్ భారీ కసరత్తు చేస్తున్నట్లు ఎవరిని బరిలో నిలిపితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయో వారికి మాత్రమే సీట్ లను కేటాయించే పనిలో బిజెపి పార్టీ ఉన్నట్లు అందుకోసం మరికొన్ని రోజుల్లోనే మిగిలి ఉన్న సీట్లను కూడా భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏ సభకి వెళ్లినా కూడా మాకు 400 కు పైగా లోక్ సన స్థానాలను ఇవ్వండి మేము దేశాన్ని మరింత అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్తాము అని చెబుతూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp