ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది.. అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు ఒకరి పై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం తో పాటు దాడులు,ప్రతిదాడులు కూడా చేసుకుంటున్నారు.. తాము అధికారంలోకి వస్తామంటూ ఇరు పార్టీల నాయకులు ప్రజలకు హామీలు ఇస్తున్నారు.. ఈసారి టీడీపీ కూటమిని అధికారం లోకి తీసుకురావడానికి తెలుగు తమ్ముళ్లు, నాయకులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు..అలాగే రాష్ట్రంలో మరోసారి వైసీపీ ని అధికారంలోకి తీసుకురావాలని నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా మాచర్ల నియోజకవర్గం లో రాజకీయం వేడెక్కింది టిడిపి నాయకులపై కక్ష్య సాధింపు గా వ్యవహరిస్తూ, దౌర్జన్యం చేస్తున్న కారంపూడి సిఐ చినమల్లయ్య పై విచారణ చేపట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో తహశీల్దార్‌ కు టిడిపి నాయకులు మంగళవారం విన్నవించుకున్నారు..సోమవారం సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతం లో టి తాగుతున్న చప్పిడి రాము పై కారంపూడి సిఐ దౌర్జన్యం చేసినట్లు వారు ఫిర్యాదు లో పేర్కొన్నారు.
 
తన కుమారుడు మాస్‌ కాపీయింగ్‌ చేశాడని ఎగతాళి చేస్తున్నారని, కారంపూడి సిఐ చినమల్లయ్య తన నోటికి వచ్చిన బూతులు అన్ని వాడినట్లు వారు తెలిపారు.. తమ కుటుంబ సభ్యులను కూడ దారుణంగా తిట్టినట్లు వారు ఫిర్యాదు లో వివరించారు.అలాగే తన దగ్గర వున్న తుపాకి తీసి అక్కడున్న వారిని భయబ్రాంతులకు గురి చేశారని వారు అన్నారు.చప్పిడి రామును పోలీసుస్టేషన్‌ కు తీసుకెళ్లి అసభ్యంగా తిట్టి, కొట్టారని బలవంతంగా స్టేట్‌మెంట్‌ కూడా వ్రాయించుకున్నారని, ఈ వ్యవహరంపై పూర్తి విచారణ చేపట్టి అతని పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వై.మల్లికార్జునరావు, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కె.శివారెడ్డి, చప్పిడి రాము, వి.నాయక్‌ మరియు జనసేన నాయకులు బి.రామాంజనే యులు,అలాగే కె.లాల్‌క్రిష్ణ, టి.కొండలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: