ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ చాలామంది సామాన్యులను సైతం ఎంపీ ఎమ్మెల్యేలుగా చేసిన ఘనత దక్కించుకుంది. ఈసారి ఎన్నికలలో కూడా సామాన్యులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది వైసిపి పార్టీ.. అలా ఆంధ్రప్రదేశ్లోని శింగనమల నియోజకవర్గం లో ఈసారి టిప్పర్ డ్రైవర్ కి సైతం తమ అభ్యర్థిగా ప్రకటించారు.. అయితే అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి వైసీపీలో అసమ్మతి సగలు మొదలయ్యాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అభ్యర్థికి వ్యతిరేకంగా మరొక అభ్యర్థి తన బల నిరూపణ చేయడానికి మక్కువ చూపుతున్నారు. వీరి యొక్క ప్రయత్నాలను సైతం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి అడ్డుకున్నప్పటికీ ఆగడం లేదు..


అనంతపురం నగరంలో జిల్లా కన్వెన్షన్ లో జరిగిన ఈ సమావేశానికి అనుమతి లేదన్న కారణం చూపించి పోలీసుల ద్వారా అడ్డుకున్నారు.. అయితే అసమతి నాయకులు.. నిన్నటి రోజున శివపురం పెద్దమ్మ గుడి వద్ద సమావేశమై తమ గలాన్ని సైతం విలపించారు.. పార్టీ అభ్యర్థి వీరాంజనేయులు మార్చాలని లేకపోతే టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి గెలుస్తుంది అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన తమను ఐదేళ్లు పద్మావతి ఆయన భర్త సాంబశివరెడ్డి అసలు పట్టించుకోవడంలేదని కేవలం బంధు వర్గానికి ఎక్కువగా పెద్ద పీఠ వైశారని పార్టీ నాయకులలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.


ఈ కారణంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈసారి ఎన్నికలలో టికెట్టు లేదని వారు చూపించిన వ్యక్తికి టికెట్ ఇస్తామంటూ పార్టీ అంగీకరించిందని అందుకే వీరాంజనేయులును పోటీ దింపారని ఆయన కూడా సాంబశివారెడ్డి సొంత మనిషి అని పలువురు వైసిపి నేతలు అసమ్మతి వర్గం వీరిని వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా శింగనమల అభ్యర్థిని సైతం ప్రకటించడానికి ముందు పార్టీ యొక్క శ్రేణుల అభిప్రాయాలను అసలు తీసుకోలేదని అంటూ సత్యనారాయణ రెడ్డి, మిద్దె కుల్లయప్ప, నారాయణరెడ్డి తదితరులు సైతం తెలియజేస్తున్నారు. శింగనమల అభ్యర్థిని మార్చకుంటే వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కదంటూ సీఎం జగన్ ని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయం పైన అటు వైసిపి నేతలు సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: