ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం కొనసాగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందుకి ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల పైన అన్ని పార్టీల దృష్టి ఉంది  ఇలాంటి సమయంలో ఇక గత ఎన్నికల్లో భంగపాటుకు గురైన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నేతలందరూ కూడా వరుసగా షాక్ లు ఇస్తున్నారు. ఏకంగా ఎన్నో ఏళ్ల నుంచి బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కీలక నేతలుగా వ్యవహరించి.. ఇక ఎన్నో పెద్ద పెద్ద పదవులు చేపట్టిన వారు సైతం ఇక ఇప్పుడు కారు దిగి హస్తం గూటికి చేరుకుంటున్నారు అని చెప్పాలి.


 ఇప్పటికే కేటీఆర్ వెన్నంటే నడిచిన బొంతు రామ్మోహన్ తో పాటు దానం నాగేందర్, జితేందర్ రె,డ్డి పట్నం మహేందర్ లాంటి కీలక నేతలు హస్తం తో చేయి కలిపారు. ఇక ఇటీవల మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేకే ఇంద్రకరణ్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు సైతం హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఒకవేళ పూర్తిస్థాయిలో కాంగ్రెస్ గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఉంటారు అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఇలా రేవంత్ రెడ్డి బి ఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నాయకులను కాంగ్రెస్ పార్టీలో లోక్సభ ఎన్నికల ముందు చేర్చుకోవడానికి ఒక పెద్ద కారణమే ఉందట.



 కేసిఆర్ మాస్టర్ మైండ్ తో ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొని ఇక హస్తము ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టడానికి.. ముందే సీఎం రేవంత్ ఆ పని మొదలు పెట్టాడని.. తద్వారా మరింత మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకొని ఇకప్రభుత్వం కూలిపోకుండా పటిష్ట స్థితిలో ఉంచుకోవాలనిరేవంత్ మాస్టర్ ప్లాన్ వేశాడని అందుకే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్షను రెట్టింపు ఉత్సాహంతో సాగిస్తున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: