ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది.. ఈ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతి పక్ష పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచార హోరు మొదలు పెట్టింది. అలాగే ప్రతి పక్ష పార్టీలు  టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ 144 స్థానాల్లో మరియు 17 ఎంపీ స్థానాలలో పోటీ చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నాలుగు జాబితాలలో ప్రకటించింది..అలాగే కూటమి లో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో మరియు 2 ఎంపీ స్థానాలలో అలాగే బీజేపీ పార్టీ 10 అసెంబ్లీ స్థానాల్లోను మరియు 6 ఎంపీ స్థానాలలో  పోటీ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటన చేశారు.అయితే తాజాగా బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా పై అధికార పార్టీ వైసీపీ సెటైర్ లు వేస్తుంది.

జాబితా లో ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది. అయితే కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకుండా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తక్కువ ఓటు మెజారిటీ వున్న కూడా వారికే సీటు కేటాయించడంతో... బీజేపీ మరో తెలుగుదేశం పార్టీ లా వ్యవహరిస్తుంది అంటూ వైసీపీ సెటైర్ వేస్తుంది..అయితే వైసీపీ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు సమాధానం ఇస్తున్నారు..బీజేపీ పార్టీ వ్యూహం ప్రకారం సీట్ల సర్దుబాటు జరుగుతుందని.. రాష్ట్రంలో ఈ సారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారం చేజిక్కించుకుంటుందని తెలియజేస్తున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలన అంతమోందించెందుకే ఈ కూటమి ఏర్పడినట్లు బీజేపీ నేతలు తెలియజేస్తున్నారు..అయితే గతంలో భారీ సీట్లు సాధించిన వైసీపీ ఈసారి క్లీన్ స్వీప్ చేయాలనీ భావిస్తుంది..డానికి అనుగుణంగానే ప్రచారంలో జోరు పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: