
కానీ, ఇప్పుడు అసలు సమస్య ఎదురు కానుంది. న్యాయపరంగా.. చట్టపరంగా కూడా.. జగన్ ఇరుకున పడేలా.. వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అప్పట్లో అంటే.. వైసీపీ హయాంలో తనపైనా తన కుమారుడిపైనా.. ఇతర నాయకులు.. కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సహా .. మరింత మందిపై నమోదైన కేసుల వ్యవహారాన్ని ఆయన సమీక్షించేందుకు రెడీ అయ్యా రు. అప్పట్లో రాజకీయ కారణాలతోనే తమపై కేసులు పెట్టారన్న వాదన ను ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆయా కేసులను ఇప్పుడు సమీక్షించి.. రాజకీయ దురుద్దేశంతో తమపై మోపిన కేసులను రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది జగన్‌కు అతి భారీ దెబ్బ. ఎందుకంటే.. ఎక్కడా తాము రాజకీయా లు చూడలేదని.. అంతా పారదర్శకంగానే వ్యవహరించామని ఆయన చెబుతున్నారు. కానీ, ఆయా కేసుల వెనుక.. రాజకీయాలు ఉన్నాయన్నది టీడీపీ నేతల వాదన. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సమీక్ష చేస్తున్నారు. అయితే.. దీనిపై స్థానిక పత్రిక ఎడిటర్ బాలగంగాధర తిలక్ అనేక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
అప్పటి కేసులను సమీక్షించే అధికారం లేదని.. ఇప్పుడున్న సీఎంపైనే కేసులు నమోదయ్యాయని, వారంతా న్యాయ విచారణ ఎదుర్కొనేలా ఆదేశించాలని కోరుతూ.. పిటిషన్ వేశారు. అయితే.. దీనిని హైకోర్టు సీరియస్‌గా తీసుకుని.. చంద్రబాబు చేస్తున్నది తప్పు కాదని వ్యాఖ్యానించింది. ఏపీ ప్రభుత్వానికి రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసులను సమీక్షించుకునే హక్కు ఉందని తేల్చి చెప్పింది. అంటే.. ఒకరకంగా.. చంద్రబాబుకు ఒకటి కాదు మరిన్ని ఆయుధాలు అందించినట్టు అయింది. ఇది జగన్‌కు మున్ముందు.. మరింత ఉచ్చుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.