
ఐదు సంవత్సరాలలో 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. దీనితో ఐదు సంవత్సరాలు పాటు రైతులు అనేక ఇబ్బందులు పడటంతో పాటు ఆర్థికంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ ఆ ప్రాంత రైతులకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు నెలల్లోనే ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేశారు. దీంతో ఆ ప్రాంత రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 2018లో 9కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించగా. ఇప్పుడు ఆ అంచనా రూ.14.88 కోట్లకు చేరుకున్నప్పటికీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ నుంచి త్వరితగతిన నిధులు మంజూరు చేయించి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేయించారు. ఈ సందర్భంగా ఎస్.సి వెంకటరత్నం మాట్లాడుతూ త్వరలో మంత్రి నారా లోకేష్ చేతులు మీదుగా హైలెవల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలోని 15 గ్రామాల్లో ఉన్న 25,344 ఎకరాలకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈ అనిల్ కుమార్, జేఈ సుభాషిని, ఐడీసీ ఏఈ గోపిచాంద్ తదితరులు పాల్గొన్నారు.