ఆంధ్రప్రదేశ్లోని హత్య రాజకీయాలు రోజురోజుకీ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అధికారం మారిన తర్వాత ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత ఆలూరు నియోజకవర్గం ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్య ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యేలా చేస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఉండేటువంటి చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ సంఘటన జరిగిందట. గుంతకల్లు నుండి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తూ ఉండగా పక్క ప్లాన్ తోనే హత్య చేసినట్లుగా సమాచారం.


లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని టిప్పర్ తో ఢీ కొట్టి మరి చంపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .ఈ ఘటనలో కారులో ఉన్న లక్ష్మీనారాయణ మరణించకపోవడంతో కత్తులతో దాడి చేసి మరి తీవ్రంగా ఆయనను గాయపరిచి హత్య చేశారట. తీవ్ర గాయాలైనట్లుగా గుర్తించిన కొంతమంది అక్కడ వ్యక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు ఉపయోగం లేకుండా పోయిందట. ఆసుపత్రికి తరలించే మధ్యలోనే లక్ష్మీనారాయణ ప్రాణాలు విడిచినట్లుగా అక్కడ వారు తెలియజేస్తున్నారు. అయితే ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు.


అయితే లక్ష్మీనారాయణ చంపింది ఎవరు ?ఆయన పైన దాడి చేయించింది ఎవరు? ఇంతగా చేయవలసిన అవసరం ఏముందనే విషయం పైన పోలీసులు సైతం విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటన వెనుక ఎవరి హస్తం ఉంది అనే విషయం పైన ఇంకా పోలీసులు విచారణ చేయబడుతున్నట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ చంపడంతో ఒక్కసారిగా రాయలసీమలోని రాజకీయాలు మరింత వేడెక్కించేలా కనిపిస్తున్నాయి. మరి పోలీసులు ఈ కేసును ఎన్ని గంటలలో చేదిస్తారో చూడాలి మరి. ఇటీవలే కాలంలో వరుసగా హత్య రాజకీయాలు ఎక్కువగా ఏపీ అంతట వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: