
వాస్తవానికి వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు. ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శ్వాస కోశ సమస్యతో బాధపడుతున్న వల్లభనేని వంశీ.. తీవ్ర దగ్గు కారణంగా... ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలుస్తోంది. ఇక తాజాగా వల్లభనేని వంశీ కి తీవ్ర అస్వస్థత నెలకొందని సమాచారం అందుతుంది. దీంతో వెంటనే జైలు నుంచి కంకిపాడు లోని ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని తరలించారు.
ఈ విషయం తెలియగానే కంటతడి పెట్టుకుంటూ వల్లభనేని వంశీ భార్య, పేర్ని నాని ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. వల్లభనేని వంశీ పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇవాళ విచారణలోకి వల్లభనేని వంశీ వెళ్లాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే వల్లభనేని వంశీకి అర్ధరాత్రి అస్వస్థత నెలపొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని చెబుతున్నారు వైద్యులు. ఐసీయూ లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు