
కాంగ్రెస్ నేతలను బీజేపీ నాయకులు ఎందుకు కాపాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఛార్జ్ షీట్ లో సీఎం పేరు రావడం తెలంగాణకే అవమానకరం అని ఆయన వెల్లడించారు. నాడు ఓటుకు నోటు.. నేడు సీటుకు రూటు అని కేటీఆర్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు వచ్చినా కొన్ని పత్రికలు ఆ మ్యాటర్ రాయలేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ కేసులో కేసీఆర్ పేరు ఉంటే తాటికాయంత అక్షరాలతో రాసేవారని కేటీఆర్ అన్నారు. హెరాల్డ్ కేసులో రేవంత్ పై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రేవంత్ కు బ్యాగ్ మ్యాన్ అనే పేరు వచ్చిందని మూటలు మోసే రేవంత్ పీసీసీ పదవిని తెచ్చుకున్నారని కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ బుద్ధి, వైఖరి ఏ మాత్రం మారలేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పీసీసీ చీఫ్ పదవి కొన్నారని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారని ఆయన అన్నారు. రేవంత్ ఇప్పుడు మూటలు మోసి పదవి కాపాడుకుంటున్నారని ఆయన తెలిపారు. రేవంత్ రాజీనామా చేయాలంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేటీఆర్ చేసిన కామెంట్లు ఒకింత సంచలనం సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఈ కామెంట్లపై రియాక్ట్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు