- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ లో మాజీ ముఖ్య‌మంత్రి .. బీఆర్ఎస్ అధినేత క‌ల్వంకుట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కుమార్తె త‌న తండ్రి కే లేఖ రాయ‌డం తో మొద‌లైన రాజ‌కీయ ప‌రిణామాలు చ‌క‌చ‌కా మారిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌విత కొత్త పార్టీ పెడ‌తారంటూ కూడా ఊహాగానాలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుందని జరుగుతున్న ప్రచారంపై మెద‌క్‌ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు . జూన్ 2న కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుందని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రకటన అనంతరం షర్మిల తరహాలోనే కవిత తెలంగాణలో పాదయాత్ర చేస్తుందని కూడా ర‌ఘునంద‌న్ జోస్యం తెలిపారు.


ఇక ఈ క్ర‌మంలో నే కవిత రాజకీయంగా దూకుడుగా వేస్తున్న అడుగులపై సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దేవుడు, ఆయన పక్కన దెయ్యాలు ఉన్నాయని కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..దేవుడు, దెయ్యాల పక్కన ఉంటే ఇప్పుడు స్పందించ‌డం ఎందుకు ? మ‌రి గ‌త‌ పన్నెండు ఏళ్లుగా ఏం చేస్తున్నారని కూడా ఆయ‌న నిలదీశారు. ఇక
బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని భయంతోనే నాటకం స్టార్ట్ చేశారని కూడా ఆయ‌న ఆరోపించారు. ఒక‌రి తో గొడవ లు అయితే మ‌రొకరి ద‌గ్గ‌ర‌కు వెళ్లేలా గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. మాట్లాడు కోవాల‌ని అనుకుంటే తండ్రి . కూతురు మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తులు ఎందుకు ఉంటారు ? అని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏదేమైనా తెలంగాణ రాజ‌కీయాల్లో క‌విత కొత్త పార్టీ ఏర్పాటు అంశం ఇప్పుడు ఒక ఊపు ఊపేస్తోంది. మ‌రి ఇది ఎటు యూట‌ర్న్ తీసుకుంటుందో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: