( అమరావతి - ఇండియా హెరాల్డ్ )


రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ టీచర్ల కలలను సాకారం చేయడానికి, ప్రభుత్వపాఠశాలల్లో విద్యాప్రమాణాలను పర్చాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ఏడాది జూన్ 13వతేదీన మెగా డిఎస్సీ ఫైలుపై తొలిసంతకం సంతకం చేశారు. ఆ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్టోబర్ లో టెట్ నిర్వహణ అనంతరం ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శక విధానంలో పకడ్బందీగా మెగా DSC-2025 పరీక్షలను 6-6-2025నుంచి ఆన్ లైన్ విధానంలో నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మెగా డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులనుంచి ప్రధానంగా 5 అభ్యర్థనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. పూర్తిస్థాయి పరిశీలన చేసి అభ్యర్థులకు నష్టం జరగని విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 

1)    DSC పరీక్షకు సమయం – 90 రోజులు కావాలి

ప్రభుత్వ స్పందన: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు 13.06.2024న పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్‌సి నియామక ప్రక్రియ ప్రారంభించబడింది, (16,347) పోస్టులకు డిఎస్‌సి నియామకాలను ప్రారంభించడానికి జి.ఓ.ఎం.ఎస్.నెం.27ను జారీ చేసింది. అంతకు ముందు ap TET పరీక్ష ఫిబ్రవరి 2024లో జరిగింది. ఇంకా కొత్తగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని, TET స్కోర్‌లను మెరుగుపరచడానికి DSC అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంది.
AP TET జూలైలో మరోమారు నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందుకు సంబంధించి అక్టోబర్ 2024లో పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఆ తర్వాత అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా DSC సిలబస్‌ను నవంబర్ 2024లో ap DSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తద్వారా అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం ఆరు నెలల కంటే ఎక్కువ సమయం లభించినట్లయింది.


విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమవున్న నేపథ్యంలో మెగా DSC పరీక్షకు 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఇస్తే కొత్తగా నియమితులయ్యే టీచర్లు సంవత్సరం మధ్యలో లేదా తరువాత చేరాల్సి ఉంటుంది. దీని ఫలితంగా విద్యార్థులు దాదాపు 4-5 నెలల సిలబస్ కవరేజ్ కోల్పోతారు. ఇది విద్యార్థుల ప్రాథమిక అభ్యాసం, పరీక్ష సంసిద్ధతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతోపాటు నియామకాల్లో జాప్యం జరిగితే మెగా డిఎస్సీకి పోటీపడుతున్న దాదాపు 2.45లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
(అందువల్ల ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగినంత సమయం ఇవ్వలేదన్న వాదన సరికాదు.)


2)    ఒకజిల్లాకు ఒక ప్రశ్నాపత్రం విధానాన్ని అమలుచేయాలి

ప్రభుత్వస్పందన: మెగా DSCలో 26 జిల్లాల్లో లక్షలాది మంది అభ్యర్థులు పాల్గొంటారు. CBT పెద్ద ఎత్తున పరీక్షలను నిర్వహించడంలో నిష్పాక్షికత, భద్రత, ప్రామాణీకరణను నిర్ధారిస్తుంది. ఇది పేపర్ లీకేజీలు, మానవ తప్పిదాలను తొలగిస్తుంది. రియల్-టైమ్ డేటా సేకరణ, మూల్యాంకనాన్ని నిర్ధారిస్తుంది.
జాతీయ స్థాయి పద్ధతులకు అనుగుణంగా లాజిస్టికల్, ఆపరేషనల్, ఫెయిర్‌నెస్-సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
DSC-2018, Special DSC-2019లోనూ ఇదే విధానం అమలైంది. న్యాయస్థానాలు కూడా నార్మలైజేషన్ విధానాన్ని సమర్థించాయి.


3)    గత 7సంవత్సరాల్లో డిఎస్సీ నిర్వహించనందున ఒసి అభ్యర్థలకు వయో పరిమితిలో సడలింపు ఇవ్వాలి.
ప్రభుత్వ స్పందన: గత ఏడేళ్లలో డిఎస్సీ నిర్వహించకపోవడం, వాస్తవిక అసాధారణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంది.  ప్రభుత్వం ap మెగా DSC-2025 ద్వారా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఒసి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 42 నుంచి 44 సంవత్సరాలకు సడలించింది.
రిజర్వ్ డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపులు అంటే SC/ST/BC-49 సంవత్సరాలు, దివ్వాంగులకు -54 సంవత్సరాలుగా నిర్ణయించింది.


4)    నేరుగా మెగాడిఎస్సీకి వెళ్లేందుకు టెట్ నిర్వహించలేదు.

ప్రభుత్వస్పందన: దేశంలో ఉపాధ్యాయుడు కావడానికి TET పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. NCTE నిబంధనల ప్రకారం TET పరీక్షను కనీసం సంవత్సరానికి ఒకసారి నిర్వహించాలి.
దీని ప్రకారం ap TET పరీక్ష ఫిబ్రవరి 2024లో నిర్వహించబడింది. కొత్తగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని, TET స్కోర్‌లను మెరుగుపరచడానికి వీలుగా DSC అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ap TET జూలై-నోటిఫికేషన్ జారీ చేయగా, పరీక్షలు అక్టోబర్ 2024లో నిర్వహించబడ్డాయి.
అదనంగా NCTE నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)లో అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ap టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT)కి అర్హులుగా పరిగణించబడతారు. తాజాగా CTET పరీక్ష డిసెంబర్ 2024లో జరిగింది.
(కాబట్టి TET పరీక్ష నిర్వహించకుండా మెగా DSC పరీక్ష నిర్వహించారనేది వాస్తవం కాదు.)


5) సమయం పొడిగింపు, TET నిర్వహణ కోసం చేసిన అభ్యర్థనలను మానవతా దృక్పథంతో పరిగణించండి.

ప్రభుత్వ స్పందన: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం మెగా DSC-2025 నోటిఫికేషన్ జారీచేసింది. అన్నిఅంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే తగినంత అవకాశాన్ని కల్పించింది. అభ్యర్థులకు 2 TET అవకాశాలతోపాటు  6 నెలలకు పైగా ప్రిపరేషన్ సమయం లభించింది.)
మొదట్లో ప్రభుత్వం ఈ ఖాళీల నియామక ప్రక్రియను విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయాలని భావించింది. అయితే, ఎస్సీ వర్గీకరణ, పరిపాలనా పరమైన కారణాల వల్ల నోటిఫికేషన్ ఏప్రిల్, 2025లో జారీ చేయబడింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం, సకాలంలో నియామకాలు చేపట్టడం అత్యవసరం. ఏదైనా ఆలస్యం జరిగితే నిరంతర ఉపాధ్యాయ ఖాళీల కారణంగా విద్యార్థులు బోధనా వనరులను కోల్పోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: