తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది .. భ‌క్త‌ల రద్దీకి అనుగుణంగా టీటీడీ కీలక చర్యలు తీసుకుంటుంది . అలాగే టెక్నాలజీ సాంకేతికతను వినియోగిస్తూ భ‌క్త‌లకు సేవలను దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తుంది .. అయితే ఇప్పుడు ఏఐ ఆధారిత సేవల కోసం కస్తృత్తులు జరుగుతుంది .. ఇదే క్రమంలో టీటీడీలో పాలన వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది .. ఇక అందుకోసం తాజాగా కీలక నియామకం చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది .. ఇక ఇప్పుడు ఈ నియామకం పై రాజకీయాల్లో గడ్డి చర్చ నడుస్తుంది . రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం కు చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ను నియమించింది .. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి గాను ఆయనకు సంబంధిత పోస్ట్ కు నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు .. టిటిడి చరిత్రలో ఈ తరహా అధికారిని నిర్మించడం ఇది రెండవసారి .


 2010 లో ఐఏఎస్ అధికారి సుధీర్ ని అప్పటి ప్రభుత్వం ఇదే పోస్టుకు నామినేట్ చేసింది .. అప్పుడు కూడా అధికారులు వీధులు బాధ్యతలు వంటివి నియామక ఉత్తర్వులు ప్రస్తావించలేదు .  అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరాల్లో అదే విధమైన అస్పష్టత కనిపించింది .. గతంలో చీఫ్‌ ఇన్‌స్పెక్టింగ్ అధికారిగా వ్యవహరించిన సుధీర్ ఏడాదిలోనే రెండుసార్లు పర్యటించారని అంటారు . అయితే ఆ రెండు సందర్భాల్లో టీటీడీకి చెందిన అన్ని విభాగాల అధికారులతో సమావేశమై టిటిడిలో పాలన ఎలా జరుగుతుంది .. కొత్త కార్యక్రమాలను ఎలా అమలు చేస్తున్నారు .. అన్న విషయాలపై సమీక్షించి వెళ్ళినట్టు  అప్పటి అధికారులు అంటున్నారు ..  ఆ తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు అలాంటి అధికారిని నియమించడం కూడా మరింత ఆసక్తిగా మారింది .. ఈ నియామకం పై టీటీడీ అధికార వర్గాల్లో ఎలాంటి క్లారిటీ లేదు .. ప్రజెంట్ టిటిడి ఈవో అదనపు ఈవోల‌ను సీఎం చంద్రబాబు ఏరీకోరి బాధ్యతలు ఇచ్చారు .. వారిద్దరు సీఎం ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారని అభిప్రాయం కూడా ఉంది ..


అయితే ఇప్పుడు మళ్లీ చీఫ్‌ ఇన్‌స్పెక్టింగ్‌ ఆఫీసర్ నియామకం ఎందుకు చేస్తారని చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది .. ఈ రీసెంట్ టైంలో టిటిడి ఉన్నత స్థాయి అధికారలు , అనధికారులు సీఎం చంద్రబాబుకు అక్కడి వ్యవహారాలపై వేరువేరుగా నివేదికలు ఇస్తున్నట్టు దేవస్థానం వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నివేదికలోని కొన్ని కీలక అంశాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అందువల్ల సీఎం ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితమైన సమాచారం ఫీడ్బ్యాక్ కోసం ఈ తరహా నియామ‌కం చేపట్టి ఉంటారన్న చర్చ కూడా జరుగుతుంది .. సాయి ప్రసాద్ జల‌వ‌న‌రుల‌ శాఖ ముఖ్య కార్యదర్శి అయినప్పటికీ ఈయన సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న క్రమంలో ఈ నియామకం జరిగిందన్న చర్చ జరుగుతుంది .  దీంతో సాయి ప్రసాద్ టిటిడిలో తనకు ఇచ్చిన బాధ్యతలు విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారు అనేది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: