
రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన ఏపీ , తెలంగాణకు బిజెపి అధ్యక్షులని ఖరారు చేసే సమయం వచ్చేసింది. ఇందుకు ముహూర్తం పెట్టేసింది. జూలై 1వ తేదీన ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల అధికారిగా లక్ష్మణ్‌ను పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే ఇదంతా ప్రక్రియ మాత్రమే. ఇప్పటికే పార్టీ హై కమాండ్ అధ్యక్షులను ఖరారు చేసింది. అయితే అధికారికంగా ఎవరికి చెప్పలేదు. ఒకటో తేదీన వారికి సమాచారం ఇచ్చి నామినేషన్ దాఖలు చేయాలని సూచించనున్నారు. అధిష్టానం సూచించిన ఇద్దరు తప్ప ఇతరులు ఎవరు నామినేషన్ వేసే అవకాశాలు లేదు. తెలంగాణ అధ్యక్ష పదవిని ఎవరికి ఇస్తారు ? అన్నదానిపై ఇంకా ఎలాంటి సూచనలు బయటకు రాలేదు. అయితే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న బీసీ నేత ఈటెల రాజేందర్ ఈ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనను వ్యతిరేకించే బలమైన వర్గం ఉంది. బండి సంజయ్ పేరు కూడా తెరమీదకు వచ్చింది.
కొందరు సీనియర్ నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో చూడాలి. ఇక ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై పెద్దగా ఎవరికి ఆసక్తి లేదు. కానీ బిజెపిలో అంతర్గతంగా కాస్త పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షరాలుగా ఉన్నారు. ఆమెను కొనసాగిస్తారని ప్రచారం ఉంది. అయితే రాయలసీమ నుంచి రెడ్డి వర్గానికి అవకాశం ఇవ్వాలన్న బలమైన లాబీయింగ్ కూడా మొదలైంది. ఈ విషయంలో హై కమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుందో జూలై 1న తేలిపోనుంది. అయితే అధికారంలో ఉన్న కూటమిలో కీలకమైన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటే మంచి పవర్ఫుల్ ఉంటుంది. అందుకే బిజెపి నేతలు కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు