
ఈ ఏడాది ఫిబ్రవరి నెల 16వ తేదీన వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. భూ ఆక్రమణ, అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాలు ఇతర ఆరోపణలతో వల్లభనేని వంశీపై 11 కేసులు నమోదు కావడం గమనార్హం. ఒక్కో కేసులో బెయిల్ పొందిన వల్లభనేని వంశీ ఎట్టకేలకు బయటకు వచ్చారు. వంశీ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఏ మాత్రం ఫలితం అయితే లేకుండా పోయింది.
వల్లభనేని వంశీ రిలీజ్ నేపథ్యంలో ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాబోయే రోజుల్లో వల్లభనేని వంశీ మరింత జాగ్రత్తగా తెలివైన వ్యూహాలతో ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదల కాకూడదని కొందరు నేతలు పంతం తిట్టినా అందుకు సంబంధించి ఫలితం లేకుండా పోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వల్లభనేని వంశీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. వల్లభనేని వంశీ బయటకు వచ్చిన నేపథ్యంలో కూటమి సర్కార్ భవిష్యత్తులో రాజకీయాల విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి. వల్లభనేని వంశీ రాబోయే రోజులలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు