- ( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో మ‌రో కొత్త జిల్లా ఆవిర్భ‌వించ నుంది. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీలో పాత 13 జిల్లాల తోనే అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న కొన‌సాగించారు. అదే టైంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ను ప‌లు చిన్న జిల్లాలుగా విభ‌జ‌న చేశారు. కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వ‌చ్చాక కూడా మ‌ళ్లీ కొన్ని కొత్త జిల్లా లు ఏర్పాటు చేశారు. ఇక ఏపీలో చంద్ర‌బాబు త‌ర్వాత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లా గా ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అందుకు అనుగుణంగానే ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లా గా చేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రం పాల‌న సౌల‌భ్యానికి అనుగుణంగా ఒకటి , రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆ నియోజ‌క‌వ‌ర్గం ఉన్న పార్ల‌మెంటు కాకుండా .. ప‌క్క‌నే పార్ల‌మెంటు జిల్లాలో క‌లిపారు.



అయితే విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం , శ్రీకాకుళం, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో ఉన్న గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల‌ను మాత్రం రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక హామీ ప్ర‌కారం ఏపీ లో మ‌రో స‌రికొత్త జిల్లా ఏర్పాటు కానుంది. ప‌శ్చిమ ప్ర‌కాశం జిల్లాలోని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. మార్కాపురం - గిద్ద‌లూరు - క‌నిగిరి - ద‌ర్శి - య‌ర్ర‌గొండ‌పాలెం ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు క‌లిపి ఈ కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: