భద్రాచలం దేవాలయ ఈవో రమాదేవి పైన కొంతమంది స్థానికులు దాడి చేసిన ఘటన పలు సంచలనంగా మారింది. ఈ దాడిలో అధికారి రమాదేవి స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే  అక్కడికి వచ్చిన కొంతమంది అధికారులు ఈవోను హాస్పిటల్ కి తరలించారు. అయితే దేవాలయ ఈవో రమాదేవి పైన దాడి జరగడానికి ముఖ్య కారణం.. ఆ దేవాలయంకు అనుబంధంగా పురుషోత్తమట్నం అనే గ్రామం కలదు.. అందులో సుమారుగా 900 ఎకరాల భూమి ఉన్నదట. ఈ భూమి అత్యధికంగా కబ్జాకు గురైంది .భద్రాచలంకు ఆనుకొని ఉన్న ఈ గ్రామంలో ఇలాంటి కబ్జాలు ఎక్కువ అవుతున్న వాటిని నిరోధించలేని స్థితిలో ఈవో రమాదేవి ఉన్నారట.


పురుషోత్తమట్నం అనే గ్రామం కూడా ఏపీ పరిధిలోకి ఉన్న.. భౌగోళికంగా ఈ గ్రామం తెలంగాణలో ఉన్న సాంకేతికంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే చెందినది. దీనివల్ల ఈ భూములు కబ్జాకు గురవుతున్నారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది .అయినా కూడా అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. అయితే విభజన చట్ట ప్రకారం తెలంగాణలో ఐదు గ్రామాలు ఏపీలో కలిసిపోయాయి. దీనివల్ల తిరిగి మళ్లీ ఏపీలో నుంచి తెలంగాణలోకి ఈ గ్రామాలను తీసుకురావాలని డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఈ ఐదు గ్రామాలలో పురుషోత్తమట్నం కలదు.


 ఈ కబ్జా చేసిన భూములలో కొంతమంది నిర్మాణాలు చేపడుతున్నారని అక్కడ ఉండే దేవాలయ అధికారులకు కూడా కొంతమంది స్థానికులు సమాచారం ఇవ్వగా తమ సిబ్బందితో ఈవో రమాదేవి వెంటనే ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిర్మాణ పనులను గమనించి కబ్జాదారులను అడ్డుకున్నారు. దీంతో కబ్జాదారులకు ఈవో రమాదేవి కి మధ్య తోపులాట జరిగింది.. ఈ తోపులాటలో భాగంగానే ఈవో  రమాదేవి కింద పడిపోవడంతో స్పృహ తప్పి పడిపోయారట. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: