తూర్పు గోదావరి జిల్లా – కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కీలక చర్య తీసుకుంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న టీవీ రామారావును పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కార్యకర్తలు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఏం జరిగింది? – వివాదానికి తెరలేపిన ధర్నా :టీవీ రామారావు ఇటీవల, కొవ్వూరు నియోజకవర్గంలో పదవుల పంపిణీ విషయంలో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ఇదంతా పార్టీ పెద్దల అనుమతి లేకుండానే జరిగింది. ఈ అంశం కూటమి పార్టీల మధ్య సమర వాతావరణానికి దారితీస్తోందని, జనసేన నేతలు గమనించారు. అంతేకాకుండా, పార్టీ లోపలే వ్యక్తిగత గ్రూపులను పెంచే విధంగా రామారావు వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ ఘటనలపై స్పందించిన జనసేన పార్టీ: టీవీ రామారావును ఇన్‌చార్జ్ పదవీ నుంచి తప్పిస్తూ, పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం – “కూటమి స్ఫూర్తికి భంగం కలిగించేలా, స్వీయ నిర్ణయాలతో వ్యవహరించడం మేము సహించలేము. పార్టీ నియమ నిబంధనలు అవమానించడమంటేనే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది” అని వెల్లడించారు. రామారావు రాజకీయ ప్రయాణం – టీవీ రామారావు ఒకానొక సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై వైసీపీలో చేరారు. తాజాగా జనసేనలోకి వచ్చి, కొంత కాలంలోనే ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు పొందారు. వివాదాస్పదంగా: వైసీపీ హయాంలో ఆయన నర్సింగ్ కాలేజీపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశం ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీశిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు జనసేనలో చేరిన ఆయన, టీడీపీ–జనసేన కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు .. అనే ఆరోపణలు పక్కా అవుతున్నాయి అని విశ్లేషకుల అభిప్రాయం.

విచారణకు ఆదేశాలు .. వివాదం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. ఆయన వివిధ వర్గాల నాయకులతో సంప్రదింపులు జరిపి, వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు సమగ్ర విచారణ జరుగనుంది. టీవీ రామారావు సస్పెన్షన్ వ్యవహారం జనసేనలో లీడర్‌షిప్ శైలిపై ప్రశ్నలు రేపింది. ఇది తాత్కాలిక చర్యగా ఉంటుందా? లేక జనసేనలో పాత నాయకులపై కొత్త వ్యూహాల ప్రారంభమా ? అన్నది రానున్న వారం రోజుల్లో వెలువడే నివేదికపై ఆధారపడి ఉంటుంది




మరింత సమాచారం తెలుసుకోండి: