ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. నిజానికి ఆయన ఈ పదవికి వచ్చినప్పటి నుంచి కాస్త గ్రామాల్లో అభివృద్ధి దూసుకెళుతోంది అని చెప్పవచ్చు. కానీ ఒక్కోసారి పవన్ మాటలు వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆర్థిక సంఘం నిధుల గురించి ప్రకటించినటువంటి విషయం చూస్తే చాలా విడ్డూరం అనిపిస్తోంది. వినాయక చవితి సందర్భంగా గ్రామపంచాయతీలకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. పెండింగ్ లో ఉన్నటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు 1120 కోట్లను సెప్టెంబర్ లో విడుదల చేస్తామని ఆయన తెలియజేశారు. అయితే ఈ నిధులను గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇతర పథకాలకు వాడుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు.

 దీనివల్లే స్థానిక సంస్థల సర్పంచులకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అందుకే గ్రామాల అభివృద్ధి కూడా చాలా వరకు వెనుకబడిపోయిందని, కనీసం గ్రామపంచాయతీ కార్మికుల జీతాల చెల్లింపులు కూడా ఆలస్యం జరిగిందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అంతేకాదు ఈ నిధుల విడుదల కోసం కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే నిధులు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని  సూచించారు. ఈ నిధులతో గ్రామపంచాయతీలు శక్తివంతంగా మారాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.. అయితే పవన్ కళ్యాణ్ ఈ నిధుల విడుదలపై ఈ ప్రకటనలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ నిధులను వాడుకొని ఇబ్బందులకు గురిచేసిందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మరి వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతోంది ఇన్నాళ్లు ఈ నిధులను ఈ కూటమి ప్రభుత్వం కూడా వాడుకున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆనాడు వైసిపి ఏం చేసిందో మీరు కూడా ఆ విధంగానే చేసి ఇప్పుడు నిధులు విడుదల మీరే చేయించినట్లు ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ కే చెల్లుతుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇదేం ప్రకటన అంటూ విమర్శిస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్లు అయితే ఎఫ్2 సినిమాలో డైలాగ్ లాగా పవన్ కళ్యాణ్ అంటే అంతేగా అంతేగా అంటూ ఎద్దెవా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన మాటలతో కూటమి పరువు తీశారంటూ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: